nandyala

మావో స్ఫూర్తితో ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కావాలి

  • మావో స్ఫూర్తితో ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కావాలి
  • సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ పిలుపుతో మావో 45 వ వర్ధంతి సభ

నంద్యాల (పల్లెవెలుగు) 09 సెప్టెంబర్: చైనా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత మావో 45వ వర్ధంతి ని శుక్రవారం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నాడు జరిగిన ఈ కార్యక్రమానికి ఐ.ఎఫ్.టి.యు జిల్లా కోశాధికారి ఎస్ చౌడప్ప అధ్యక్షత వహించారు ముందుగా మావో చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నంద్యాల డివిజన్ కార్యదర్శి  ఎన్.శంకర్, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు రఫీ మాట్లాడుతూ చైనాలోని మంచు రాజరిక నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మావో ఆధ్వర్యంలో ప్రతిఘటన పోరాటాలు నిర్వహించారని, ముఖ్యంగా గెరిల్లా పోరాటం ద్వారా చైనాలోని ఫ్యూడల్ వ్యవస్థను భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించి అందులో విజయాన్ని సాధించారని తెలిపారు. చైనాలోని రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి వేలాది ఎకరాల భూస్వామ్య పెత్తందార్ల నుండి స్వాధీనం చేసుకుని నిరుపేద రైతులకు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో ఐ ఎఫ్ టి యు జిల్లా కోశాధికారి చౌడప్ప, డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ భవన నిర్మాణ కార్మిక సంఘం డివిజన్ సహాయ కార్యదర్శి ఖాజా మియా ,పిడిఎస్యు నంద్యాల పట్టణ అధ్యక్ష కార్యదర్శులు దస్తగిరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Back to top button