Dewanakonda

మార్చి చివరి దాకా హంద్రీనీవా నీళ్లు ఇవ్వాల్సిందే

  • మార్చి చివరి దాకా హంద్రీనీవా నీళ్లు ఇవ్వాల్సిందే
  • దేవనకొండ మండల అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు
  • సాగునీటి కోసం దేవనకొండ టర్నింగ్ లో రోడ్ దిగ్భంధం చేసిన ఆఖిలపక్ష పార్టీలు
  • వందలాదిగా పాల్గొన్న రైతులు

దేవనకొండ (ఆంధ్ర ప్రతిభ) 28 నవంబర్: హంద్రీనీవా కాలువ నుండి డిసెంబర్ 31 వరకు మాత్రమే నీళ్లు ఇస్తామన్న జీవోను నిరసిస్తూ దేవనకొండలో అఖిలపక్ష పార్టీల రైతుల ఆధ్వర్యంలో దేవనకొండ టర్నింగ్ నందు రోడ్ దిగ్బంధన కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం దేవనకొండ టర్నింగ్ నందు సాగునీటి కోసం రోడ్ దిగ్బంధన కార్యక్రమంలో భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో వివిధ పార్టీల, రైతులు కలిసి ఆందోళన నిర్వహించారు. రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోటకొండ సూర్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ విజయ్ గౌడ్, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు బి. వీరశేఖర్, సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి ఎం. నరసారావు, ఎమ్మార్పీఎస్ నాయకులు లక్ష్మన్న, జనసేన నాయకులు మక్బుల్ బాష,లోక్సత్తా నాయకులు రాందాస్ గౌడ్, రైతు సంఘం సీనియర్ నాయకులు శ్రీరాములు మాట్లాడుతూ హంద్రీనీవా సాగునీటి రైతుల పట్ల రైతులకు నీళ్లు ఇవ్వాలని చిత్తశుద్ధి ప్రభుత్వం దగ్గర లేదని నాయకులు ఒక రకంగా హామీ ఇచ్చి అధికారులు మరొక రకంగా నీళ్లు ఇవ్వలేమనే పద్ధతుల్లో జీవోలు జారీ చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని వారు విమర్శించారు. మార్చి చివరిదాకా రబీ సీజన్ పూర్తయ్యే వరకు నీళ్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. నీళ్లు ఇవ్వకుంటే దోషిగా ప్రభుత్వ పెద్దలు నిలబడాల్సి వస్తుందని పేర్కొన్నారు.

Back to top button