
మానవ సేవకు నిలువెత్తు రూపం మదర్ థెరిస్సా
మానవ సేవకు నిలువెత్తు రూపం మదర్ థెరిస్సా
నంద్యాల పట్టణంలోని బాలాకాడమీ రవీంద్ర హై స్కూల్ నందు ఆగస్టు 26న మదర్ థెరిస్సా జన్మదినాన్ని పురస్కరించుకొని పాఠశాల కరస్పాండెంట్ M.G.V రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ మాధవీ లత మదర్ థెరిస్సా చిత్రపటానికి పూలమాల వేసి ఆమె యొక్క సేవలను వేన్నోళ్ళ కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదర్ థెరిస్సా ఆగస్టు 26 1910 న జన్మించింది. రోమన్ క్యాథలిక్ సన్యాసిని.ఈమె చేసిన మానవ సేవకు చిహ్నంగా1979లో నోబెల్ శాంతి పురస్కారాన్ని, 1980లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను పొందింది. మానవ సేవయే మాధవ సేవకు నిరూపిత ఆధారభూతం మదర్ థెరిస్సా. మానవ సేవకు నిలువెత్తు రూపం మదర్ థెరిస్సా. మదర్ థెరిస్సా పేరు మనకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఎక్కడో వేరేదేశంలో పుట్టి మన భారత దేశానికి విచ్చేసి ఇక్కడ ఎందరో అభాగ్యులను తన అక్కున చేర్చుకుని గొప్ప మనసున్న తల్లిగా వారిని ఆదరించి, ఆఖరికి తన జీవితాన్ని వారి సేవ కోసం పణంగా పెట్టి ఒకానొక సమయంలో యాచన కూడా చేసిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిస్సా. మంచి, మానవత్వం, దయాగుణం, సహాయ తత్వం అనేవి ప్రతిఒక్క మనిషి అలవర్చుకోవాలని భగవంతుడు మనకు ఇంతటి గొప్ప జీవితాన్ని ఇచ్చింది ఎంతో కొంత పరులకు సహాయపడడానికే అని చెప్తుంటారు థెరిస్సా. ఎక్కడికి వెళ్లినా ప్రేమను పంచండి. మీ దగ్గరకు వచ్చినవారి జీవితంలో సంతోషం నింపకుండా వారిని వదలిపెట్టొద్దు.’ ఇది మదర్ తరచూ చెప్పే మాట. చెప్పడం మాత్రమే కాదు.. ఆమె దాన్ని చేసి చూపించారు. పేదరికంలో పుట్టిన మదర్ థెరిస్సా చిన్ననాటి నుంచి సేవా తత్పరత కలిగి ఉండేవారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే.. తాను చేయగలిగినంత సాయం చేసేవారు. దానికి ఆమె ఆర్థిక పరిస్థితి ఎన్నడూ అడ్డంకి కాలేదు.మదర్‌లా పూర్తిగా జీవితాన్ని సేవకే అంకితం చేయడం మనకు కుదరకపోవచ్చు. కానీ మన దగ్గరకు ఎవరైనా వచ్చి సాయం కోసం అర్థిస్తే.. వారికి మీకున్నంతలో ఎంతో కొంత సాయం చేయడం అలవాటు చేసుకోండి అని సేవా తత్పరత, అంకితభావం, సమాజ సేవ అలవాటు చేసుకోవాలని విద్యార్థులలో స్ఫూర్తిని నింపారు.