
మనబడి నాడు-నేడు లో భాగంగా స్కూళ్లకు అదనపు గదుల నిర్మాణం
మనబడి నాడు-నేడు లో భాగంగా స్కూళ్లకు అదనపు గదుల నిర్మాణం
కోసిగి (పల్లెవెలుగు) 15 సెప్టెంబర్: కోసిగి లోని నాడు నేడు లో భాగంగా పలు స్కూళ్లకు అదనపు గదుల నిర్మాణం మండలం ఇంచార్జ్ మురళి మోహన్ రెడ్డి భూమి పూజ చేయడం జరిగింది ఇందులో JBM స్కూల్లో 10 కాంపోనెంట్స్ లో ఇరవై ఒక్క లక్షల 10 వేల 134 రూపాయలు,RG రంగప్ప గట్టు స్కూల్ 10 కాంపోనెంట్స్ విడుదలవడం జరిగింది. బాలుర ఉన్నత పాఠశాలలో 17 గదులకు గాను ఒక కోటి 98 లక్షలు విడుదల అవడం జరిగింది, బాలికల పాఠశాలలో రెండు అదనపు గదుల రూములు కొరకు 2,100,000 లక్షలు విడుదల అవడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సహకారంతో నాడుగేని వీధిలో ఎమ్మెల్యే సొంత నిధులతో సి సి రోడ్డు కు భూమి పూజ కూడా చేయడం జరిగింది మురళి మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే గారు కోసిగిపై ప్రత్యేక దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు