Uncategorized

మద్యం మాఫియాకు అడ్డుకట్ట వేయండి – కౌన్సిలర్ సరితాల ఆషాబీ

  • మద్యం మాఫియాకు అడ్డుకట్ట వేయండి – కౌన్సిలర్ సరితాల ఆషాబీ
  • కేతిరెడ్డి కాలనీలో యథేచ్ఛగా కర్ణాటక మద్యం అమ్మకాలు
  • ఎక్సైజ్  పోలీసుల పుణ్యమే అంటూ ఆరోపణ
  • చర్యలు తీసుకోవాలంటూ కాలనీ వాసులతో కలసి 2వ పట్టణ సీఐకి ఫిర్యాదు

ధర్మవరం, అక్టోబర్ 11;(పల్లెవెలుగు): అక్రమంగా కర్ణాటక మద్యం అమ్ముతున్న మద్యం మాఫియా పై చర్యలు చేపట్టాలంటూ కేతిరెడ్డి కాలనీ వార్డు కౌన్సిలర్ సరితాల ఆషాబీ భర్త సరితాల బాషా కాలనీ ప్రజలతో వెళ్లి  2వ పట్టణ సీఐ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేతిరెడ్డి కాలనీలో కొందరు వ్యక్తులు ఇళ్ళను అద్దెకు తీసుకుని కర్ణాటక మద్యాన్ని అమ్ముతున్నారని,పట్టణ శివారు ప్రాంతం కావడంతో మద్యం సేవించడం కోసమని ఆకతాయిలు  సాయంత్రం కాగానే కాలనీలోని అండర్ బ్రిడ్జి వద్ద మకాం వేస్తున్నారని,కాలనీ ప్రజల రాకపోకలకు ఆ మార్గం తప్ప వేరే దారి లేకపోడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు, భయాందోళనలకు గురువుతున్నారనీ, మద్యం మత్తులో గతంలో హత్యలు, గొడవలు కూడా జరిగాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారనీ, ఇలాంటి పరిస్థితుల్లో మద్యం మాఫియా కాలనీలో అక్రమ మద్యం అమ్మకాలు సాగిస్తుండడం ఆందోళన కలిగిస్తోందని తక్షణమే పోలీసులు చర్యలు చేపట్టాలని సీఐ రాజాను కోరారు.

 

ఎక్సైజ్ పోలీసుల పుణ్యమే

కేతిరెడ్డి కాలనీ అక్రమ మద్యం మాఫియాకు అడ్డాగా మారడానికి కారణం ఎక్సైజ్ పోలీసులేనంటూ ఆరోపించారు. అక్రమ మద్యం రవాణా, అమ్మకాలు అరికట్టాల్సిన ఎక్సైజ్ పోలీసుల్లో కొందరు కాసులకు కక్కుర్తిపడి మద్యం మాఫియాదారులతో ఇటీవల దసరామామూళ్లు కూడా అందుకొని చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నట్లు కాలనీ వాసుల్లో పెద్దఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయని అందువల్ల ఈ అక్రమ మద్యం మాఫియా అమ్మకాల సమస్యపై కనీసం మీరైనా చర్యలు చేపట్టి కాలనీలో అక్రమ మద్యం అమ్మకాలు అరికట్టాలని ఫిర్యాదు చేస్తున్నామని సరితాల బాషా సీఐ రాజా కు ఫిర్యాదు పత్రం అందించారు. మద్యం మత్తులో గతంలో హత్యలు, గొడవలు కూడా జరిగాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారనీ, ఇలాంటి పరిస్థితుల్లో మద్యం మాఫియా కాలనీలో అక్రమ మద్యం అమ్మకాలు సాగిస్తుండడం ఆందోళన కలిగిస్తోందని తక్షణమే పోలీసులు చర్యలు చేపట్టాలని సీఐ రాజాను కోరారు.

Back to top button