
మండుస్ తుపాన్ వలన దెబ్బతిన్న రైతులను ఆదుకోండి : బీజేపీ
మండుస్ తుపాన్ వలన దెబ్బతిన్న రైతులను ఆదుకోండి : బీజేపీ
నంద్యాల జిల్లాలోని అన్నీ మండలలో అకాల వర్షాలవలన దాదాపుగా 10778 హేక్టర్లలో చేతికొచ్చిన పంట దెబ్బతినిందని కావున వెంటనే రైతులకు ఎకరానికి ముప్పై వేల చొప్పున తక్షణ సహాయం అందించాలని బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కొత్తకాపు హేమసుందర్ రెడ్డి కిసాన్ మోర్చా జిల్లా ఇంచార్జ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి లు జాయింట్ కలెక్టర్ నిశాంతి గారికి మెమోరాండం సమర్పించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అరుగలం కష్టపడి రెయనక, పగలనక చేమాటోర్చి ఒకవైపు పకృతి తో మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో రైతు అనేక సమస్యలు ఎదుర్కొని పంటలు పండిస్తూన్నాడు కానీ రాష్ట్ర ప్రభుత్వం సమయానికి కొనుగోలు చేసుకోలేక ఈరోజు అత్యధికముగా పంట నష్టం చేకూరందని ముఖ్యంగా వరి, కంది , మొక్క జొన్న, శనగ, పత్తి, అరటి వంటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి,కొన్ని పంటలు పొలంలోనే మొలకలు ఎత్తయని , వాటిని ఎలా అమ్ముకోవాలో రైతులకు అర్థం కావడం లేదని అంటున్నారు మరియు రైతుకు పెట్టిన పెట్టుబడి కుడా వచ్చేలా లేదని ,రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోక పోతే రైతులు ఆత్మహత్యేలే శరణ్యo అని వారన్నారు ,ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఇంచార్జి శ్రీనాథ్ రెడ్డి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు వడ్డే మహారాజ్, దేశయ్ విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు