panyam

భూమిలేని నిరుపేదలుకు న్యాయం చేయాలి ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి

  • పిన్నాపురం గ్రామము భూమిలేని నిరుపేదలుకు న్యాయం చేయాలి ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి
  • మండలంలోని పిన్నపురం గ్రామంలో పేదల అనుభవంలో ఉన్న ప్రభుత్వ బంజరు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ. ధర్నా నిర్వహించారు

పాణ్యం మండలం పిన్నాపురం గ్రామంలో జీవిస్తున్న నిరుపేదళం మాకు ఎలాంటి ఆర్థిక వనరులు లేవు కేవలం రెక్కల కష్టం పైనే ఆధారపడి జీవిస్తున్నాము. మా గ్రామం హైవే రోడ్డుకు 15 కిలోమీటర్ల దూరంలో తిప్పల పైన జీవిస్తున్నాము. మాకు అడవిలో ఉన్న గిరిజనులకు ఏమాత్రం తేడా లేదు. ఈ గ్రామంలో మా తాతల, బుత్తాతల కాలం నుంచి వ్యవసాయ కూలీలు గానే జీవిస్తున్నాము. మా గ్రామంలో ఉన్న ప్రభుత్వ బంజరు పొలాలను సాగు చేస్తూ కూలీతోపాటు మా పొలాల్లో వచ్చే కొంత ఆర్థిక వనరులతో జీవిస్తున్నాము. మాకు ఇప్పటి వరకు మేము అనుభవించేటువంటి భూమికి ప్రభుత్వం వారు పట్టాలు మంజూరు చేయలేదు. పట్టాలు లేనందువల్ల ప్రభుత్వ బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం కానీ, రైతు భరోసా గాని పంటల నష్టపరిహారం కానీ, సబ్సిడీ విత్తనాలు, ఎరువుల కు నోచుకోవడం లేదు. అందువలన అధికారులు మాపై దయ ఉంచి మేము అనుభవిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ బంజరు భూమిని పట్టాలు ఇచ్చి మా జీవన ఉపాధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, మహమ్మద్ హుస్సేన్, భాస్కర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Back to top button