Dewanakonda

భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం… ఆరుమంది అరెస్ట్

భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం… ఆరుమంది అరెస్ట్

దేవనకొండ ఎస్సై భూపాలుడు మరియు పత్తికొండ ఎస్ ఈ బి మరియు దేవనకొండ పోలీస్ సిబ్బంది కలిసి అక్రమంగా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా కర్ణాటక రాష్ట్రానికి చెందిన అక్రమ మద్యం తరలిస్తుండగా 6 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి  1632(90ఎంఎల్) టెట్రా ప్యాకెట్ల అక్రమ కర్ణాటక మద్యంను, తరలిస్తున్న ఆటోను రెండు మోటర్ సైకిళ్లను సీజ్ చేసి,మద్యం ను తరలిస్తున్న 6 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు ఎస్ఈబి ఎస్సై మరియు దేవనకొండ ఎస్సై పోలీస్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  పత్తికొండ ఎస్ఈబి వారు మరియు దేవనకొండ ఎస్సై ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి కర్ణాటక మధ్యాన్ని  సీజ్  చేసినట్లు   తెలిపారు. వారిని రిమైండ్ నిమిత్తం గౌరవ పత్తికొండ మెజిస్ట్రేట్ గారు ముందు హాజరు పరచడమైనది ఇంకా ఈ కేసు విచారణ జరుగుతుంది ఇందులో ఇంకా ఎంతమంది పాత్ర ఉందో త్వరలో తెలియజేస్తామని భూపాలుడు తెలిపారు

Back to top button