nandyala

భారత రాజ్యాంగ మే  భారతీయుల ఆధునిక ధర్మ శాస్త్రం

భారత రాజ్యాంగ మే  భారతీయుల ఆధునిక ధర్మ శాస్త్రం

నంద్యాల (పల్లెవేలుగు) 26 నవంబర్: శనివారం పట్టణంలోని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శిక్షణా తరగతుల కార్యక్రమంలో ముఖ్య అతిథులు రాజ్యాంగ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణారెడ్డి జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ బ్రహ్మారెడ్డి నంద్యాల జిల్లా అధ్యక్షులు ఆకుమల్ల రహీం ఐక్యవేదిక జిల్లా సభ్యులు రాంబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్వలి కోశాధికారి సత్యనారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధులు మాట్లాడుతూ ప్రపంచంలో భారత దేశ రాజ్యాంగము అతిపెద్ద రాజ్యాంగం అని తెలిపారు. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క పవిత్ర గ్రంథము ఉన్నట్లే అన్ని మతాలవారు భారత రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం లాంటిదని తెలిపారు మనం ఏ పని చేయాలన్నా చేయకూడదన్న రాజ్యాంగంలో లిఖించబడ్డ చట్టాలకు లోబడి పని చేయాల్సిన అవసరం ఉందని సూచించారు దానిని వ్యతిరేకించే హక్కు ఎవరికీ లేదని తెలిపారు ముఖ్యంగా నేటి పరిస్థితులలో పాలకులు రాజులుగా చలామణి అవుతున్నారని వారిని ఎన్నుకున్న ప్రజలు మాత్రం బానిసలుగా జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వాస్తవానికి రాజ్యాంగం ప్రకారం ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు అధికారులు ప్రజాస్వామ్యానికి లోబడి ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూ ఉండాలని కానీ ఇక్కడ వాటికి విరుద్ధంగా జరుగుతుందని తెలిపారు కాబట్టి ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని అవపోషణ పట్టి, ప్రశ్నించే తత్వం తెచ్చుకున్నప్పుడే మెరుగైన సమాజ స్థాపన సాధ్యమవుతుందని తెలిపారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button