nandyala

భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 133 వ జయంతి

భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 133 వ జయంతి

కాంగ్రెస్ పార్టీ  నంద్యాల పట్టణ అధ్యక్షుడు దాసరి చింతలయ ఆధ్వర్యంలో భారత రత్న మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి133 వ జయంతి (బాలల దినోత్సవం)సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. నంద్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ చింతల మోహన్ రావు మాట్లాడుతూ నెహ్రూ  స్వతంత్ర సమరయోధులు, భారత దేశ మొదటి ప్రధాని  పంచవర్ష ప్రణాళికలు, అలీనోద్యమ రూపశిల్పి.  బాలలు అంటే అమితమైన ప్రేమభిమానం అందుకే  ఆయనపుట్టిన రోజు  బాలల దినోత్సవం జరుపుకుంటారని అన్నారు. ఆయన నేటి యువతకు ఆదర్శనీయుడని అన్నారు నెహ్రు ఈ దేశ భవిష్యత్తు కొరకు తన సొంత ఆస్తులు అన్నిటిని కూడా అమ్మి ఈ దేశానికి ఎన్నో రకాల ఉపాధి అవకాశాల కొరకు ఎన్నో కంపెనీలను నెలకొల్పి , మనిషివ్యాప్తంగా ఎన్నో ప్రాజెక్టులను నిర్మించి ఈ దేశ ప్రగతికి తోడ్పాటు అందించారు అదే మార్గంలో ఇందిరా గాంధీ  నడిచి ఈ దేశానికి హరిత విప్లవం తీసుకొని వచ్చి రైతన్ననికి కార్మికులకు కర్షకులకు అండగా నిలబడ్డారు వారి తనయుడు రాజీవ్ గాంధీ ఈ దేశానికి ఐటీ విప్లవాన్ని తీసుకొని వచ్చి ఈ దేశం ముందుకు నడవడానికి ఎంతో తోడ్పాటు అందించారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశానికి విచ్ఛిన్నం చేయడానికి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల్లో ఏవైతే సంపాదించి పెట్టిందో వాటిని అమ్ముకొని తినటానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు  అందుకే రాహుల్ గాంధీ  భారత్ జూడో యాత్ర సాగిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాను అని ఒక భరోసాతో  భారత్ జూడో యాత్రకు అపూర్వమైన స్పందన లభిస్తుంది రాబోయే రోజుల్లో భారతదేశానికి  రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే దేశంలో గిరిజనులు హరిజనులు అందరికీ సమాన న్యాయం జరుగుతుందని తెలియజేశారు. ఈ మార్యక్రమం లో  APCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నంద్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చింతల మోహన్ రావు, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కరాటే బాలకృష్ణ,  iNTUC జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఆర్టీసీ ప్రసాద్, యూత్ కాంగ్రెస్ నాయకులు పసుపుల అజయ్ కుమార్, iNTUC ఆటో యూనియన్ పట్టణ అధ్యక్షుడు మా భాష, మైనారిటీ నాయకులు చ బోలి సలాం నంద్యాల జిల్లా వైస్ ప్రెసిడెంట్ శివరాం రెడ్డి, రత్నమయ, చాంద్ భాషా తదితరులు పాల్గొన్నారు

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button