
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కోసిగి మండలం సమితి
- భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కోసిగి మండలం సమితి
- కోసిగి. సిపిఐ. ఏ.ఐ.కే.ఎస్. ఆధ్వర్యంలో రైతు రక్షణ కలినడా పాదయాత్రను జయప్రదం చేయండి
కోసిగి మండలంలో స్థానిక సీపీఐ పార్టీ కార్యాలయం ముందు డిసెంబర్ 16 నుండి 20 వరకు మంత్రాలయం నుండి కర్నూలు వరకు చేపట్టే బోయే రైతు రక్షణ కాలనడక పాదయాత్రను జయప్రదం చేయాలని కోసిగి. మండలం సిపిఐ సహయ కార్యదర్శి కె.ఉలిగయ్య . ఏ.ఐ.కే.ఎస్. తాలుకా అధ్యక్షులు యం.గోపాల్ .ఏఐఎస్ఎఫ్. తాలూకా అధ్యక్షులు వీరేష్ .aiyf తాలుకా నాయకుడు జీవన్ ఆధ్వర్యంలో రైతు రక్షణ కాలినడక పాదయాత్ర కరపత్రాలు విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరంలో కరీఫ్ సీజన్లో ఆశ జనకాంగా పంటలు సాగు చేశారు. ప్రారంభంలోనే మంచి వర్షాలు అనుకూలమైన సమయంలో వచ్చాయి పంటలు చేతికొచ్చే సమయానికి గత అక్టోబర్ నెలలో ఎడతెరిపి లేకుండా 20 రోజులు వరుసగా వర్షాలు కురిసినందున పంటలు నీటిలో మునిగి పూర్తిగా దెబ్బతిని కుళ్ళిపోయి రైతులు చాలా నష్టపోయారని ఉల్లి. మిరప. పెట్టుబడి ఖర్చు ఎకరాకు అరవై వేలు రూపాయలు. పత్తి. వేరుశనగకు ఎకరాకు నలబై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయారని వారన్నారు. ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని .అలాగే ఖరీఫ్ సీజన్ లో తీసుకున్న బ్యాంకు రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని. పంటల భీమా పథకాన్ని పూర్తిస్థాయిలో వర్తింపజేయాలని నకిలీ విత్తనాలు అమ్మిన కంపెనీలు లైసెన్స్ రద్దుచేయాలని. వలసలు నివారణను అరికట్టి స్థానికంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు. రైతులు .ఈడికి రాముడు నరసప్ప .వన్నూరు బాషా. వడ్డే గుళ్లప్ప. ఆచారి రామదాసు .తోళ్ళురాముడు .ఈరన్న. గువ్వల నాగప్ప రైతులు పాల్గొన్నారు .