
భవన నిర్మాణ కార్మిక సంఘం (ఏఐటీయూసీ అనుబంధ) జాతీయ మహాసభలు విజయవంతం చేయండి
భవన నిర్మాణ కార్మిక సంఘం (ఏఐటీయూసీ అనుబంధ) జాతీయ మహాసభలు విజయవంతం చేయండి
దేవనకొండ (ఆంధ్ర ప్రతిభ) 09 నవంబర్: ఈ నెల 26,27,28 తేదీలలో రాజమండ్రిలో జరిగే భవన నిర్మాణ కార్మిక సంఘం (ఏఐటీయూసీ అనుబంధ) జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డిసి రెహమాన్, సిపిఐ మండల కార్యదర్శి ఎం. నరసరావు పిలుపునిచ్చారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో బుధవారం ఏఐటియుసి ఆధ్వర్యంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఎమ్. నెట్టే కళ్ళు అధ్యక్షతన మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక సంఘాన్ని బలోపేతం చేయాలన్నారు. ప్రతి భవన నిర్మాణ కార్మికుడు ఈనెల 26న రాజమండ్రి లో జరిగే కార్మిక ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు. అలాగే పెండింగ్లో ఉన్న 32,000 క్లైమ్లకు నిధులు మంజూరు చేయాలన్నారు. జీవో నెంబర్ 17 ద్వారా దారి మళ్లించిన నిధులను ప్రభుత్వం సంక్షేమ బోర్డులో జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల నాయకులు సుల్తాన్, శ్రీనివాసులు, చంద్ర,సుభాన్, మధు, మాబాష, హనుమంతు, లోకేష్, వెంకట రాముడు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం భవన నిర్మాణ కార్మిక సంఘం దేవనకొండ మండల నూతన కమిటీ ఎన్నిక..
మండల అధ్యక్షులుగా ఎం.కోమేష్, ఉపాధ్యక్షులుగా బి. వీరేష్, వై.శంకర్,కె. మాదన్న, ప్రధాన కార్యదర్శిగా వి. వీరస్వామి, సహాయ కార్యదర్శిగా వి. చంద్ర,ఎమ్. లోకేష్,వి. గోవిందు, కోశాధికారిగా సి.హనుమంతు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా షేక్. రహమతుల్లా లతోపాటు 28 మంది కౌన్సిల్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి.సి రహిమాన్, సిపిఐ మండల కార్యదర్శి ఎమ్. నరసరావు తెలిపారు.