nandyala

బేతంచెర్ల మండలంలో రోడ్ సేఫ్టీ కార్యక్రమం

బేతంచెర్ల మండలంలో రోడ్ సేఫ్టీ కార్యక్రమం

నంద్యాల (పల్లెవేలుగు) 03 నవంబర్:  బేతంచెర్ల మండలంలో పాణ్యం జూనియర్ కాలేజీ మరియు ఎంపీడీవో కార్యాలయంలో రోడ్ సేఫ్టీ కార్యక్రమం, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో, సనా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో  సదస్సులు నిర్వహించడం జరిగింది. జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్, బాలకృష్ణ మరియు ఎంపీడీవో సి. వెంకన్న పి.దస్తగిరి మాట్లాడుతూ, రోడ్డు సేఫ్టీ కార్యక్రమం ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టం 2019 అమెండ్మెంట్లో, పనిష్మెంట్ తో పాటు జైల్ శిక్షలు కూడా ఈ చట్టంలో తీసుకొచ్చారని గుర్తు చేశారు, తాగి డ్రైవ్ చేయడం నిద్రమత్తుతో డ్రైవ్ చేయడం, నేరమని ఈ సందర్భంగా తెలియజేశారు, ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత వహించిన సమస్త కార్యదర్శి అప్సర్ హుస్సేన్, మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వకూడదని గుర్తు చేశారు, రీసెర్చ్ పర్సన్ కొమ్ముపాల శ్రీనివాస్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న వాళ్లు నిద్ర లేకపోవడం వల్ల, ఎక్కువ జర్నీ చేయడం వల్ల ఆక్సిడెంట్లు గురవుతున్నారని,  త్రాగి డ్రైవ్ చేస్తున్న మొదటిసారి 5000, రెండోసారి 10000 పైన తో పాటు జైలు శిక్షలు కూడా ఈ చట్టం తీసుకొచ్చిందని జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని, మత్తు పానీయాలు సేవించి డ్రైవ్ చేయకూడదని తెలిపారు. 30 పాయింట్లు నమోదు అయితే 2500 ఫైన్ వేసి కౌన్సిలింగ్ ఇస్తారని 50 పాయింట్లు నమోదు అయితే మూడు రోజులు సేల్ శిక్ష ఉంటుందని 100 పాయింట్లు నమోదు అయితే వారం రోజులు సేల్ శిక్షని 200 పాయింట్లు నమోదు అయితే రెండు వేల రూపాయలు ఫైన్ తో పిడిఆర్టి పెడతారని గురించి తెలిపారు .ఆర్ సి ఇవ్వకుండా అడ్డుపడితే 750 ఫైన్, లేనివారు బండి నడుపుతే 5000 రూపాయలు ఫైన్  డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇస్తే పదివేల రూపాయలు, రిజిస్టర్ సర్టిఫికెట్ లేకపోతే మొదటిసారి 10000 ,రెండోసారి 20,000 పై ఉంటుందని తెలిపారు ,సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకర డ్రైవింగ్ అని, 10000 రూపాయలు ఫైన్ . వాహనాల బరువుని చెక్కు కోసం ఆపకపోతే 40 వేల రూపాయలు ఫైన్ అని ,మోటార్ వెహికల్ యాక్ట్ తెలియజేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో, విద్యార్థులు, విద్యార్థు మరియు ఎంపీడీవో సిబ్బంది, సమస్త కమిటీ సభ్యులు ఉబేద్, హుమ్మర్ భాష పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button