kosigi

బులోరో వాహనం బైక్ డీ

  • బులోరో వాహనం బైక్ డీ
  • ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయలు.

కోసిగి (పల్లెవేలుగు) 07 నవంబర్: మండలపరిదిలోని తుమ్మిగనుర్ గ్రామ సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాతనూరు గ్రామం నుంచి బైక్ పై ఈరన్న, సురేష్ తుంగభద్ర కు వెళ్తుండగా తుమ్మిగనూరు గ్రామ సమీపంలో బైక్ ను బులోరా వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సురేష్ అక్కడికక్కడే మృతి చెందగా సాతనూరుకు చెందిన ఈరన్న నకు తీవ్ర గాయాలు కాగా  ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.  పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది ప్రమాదంలో బైక్ నుజ్జు నుజ్జు అయిన ఘటన స్థలానికి ఎస్సై రాజారెడ్డి సమీక్షించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజారెడ్డి, కానిస్టేబుల్ సంజీవ్  కుమార్ తెలిపారు.

Mohammad Yousuf

Mohammad Yousuf Reporter, Kosigi, Kurnool DIst
Back to top button