nandyala

బుధవారం ఖిద్మత్ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రారంభం

బుధవారం ఖిద్మత్ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రారంభం

సభ్యుడి గడప వరకు సేవలు

నంద్యాల (పల్లెవెలుగు) 12 సెప్టెంబర్: ముల్లాన్ పట్టి వీధిలో  “ఖిద్మత్” క్రెడిట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్యాంక్ 14-9-22 బుధవారం ఉదయం 10-30గం ప్రారంబిస్తున్నట్లు ఖిద్మత్ జిల్లా డైరెక్టర్ షేక్ అబ్దుల్ సమద్ తెలిపారు. కర్నాటక, తెలంగాణ, ఆ.ప్ రాష్ట్రల్లో యాభై కు పైగా శాఖల్లో డెభై వేల మంది సభ్యులునంద్యాల ఖిద్మత్ బ్రాంచి అధ్యక్షులు నవాజ్ ఖాన్ అధ్యక్షుతన ఏర్పాటు చెందిన మీడియా సమావేశంలో సమద్ మాట్లాడుతూ ఖిద్మత్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు ప్రారంభోత్సవం అనంతరం ఎన్టీఆర్ షాదీఖానాలో  జమాఆతె ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు ముహమ్మద్ రపీఖ్ అధ్యక్షతన జరిగె సమావేశం లో అతిథులుగా పార్లమెంటు సభ్యులు పోచాబ్రహ్మారెడ్డీ, ఎంఎల్ఏ రవిచంద్రా కిషోర్ రెడ్డీ, ఎమ్మెల్సీలు ఎన్ ఎండి ఫరూఖ్, సీ.ఇసాక్, రాష్ట్ర  మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ డి.ఎస్ హబీబుల్లా, హైదరాబాద్ రీజనల్ సౌలత్ మైక్రోఫైనాన్స్ సెక్రేటరీ ఇక్బాల్ హుసేన్, డైరెక్టర్ ముహమ్మద్ జాకీవుద్దీన్, మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి మహబున్నీసా, జెఐ హెచ్ రాష్ట్ర కార్యదర్శి అక్బర్ బాషా, ప్రముఖ పారిశ్రామికవేత్త వహీద్ ఖాన్, డా.నౌమన్, జిల్లా మైనార్టీ అధికారి మహబూబ్ బాషా, న్యాయవాది డా.బాలస్వామి కౌన్సిలర్లు తదితరులు పాల్గంటారన్నారు. సభ్యుల గడప వరకు సేవలు అందించడం, వడ్డీరహిత లోన్, ఆన్ లైన్ సేవలు, సభ్యుల భాగస్వామ్యం తో నడిచె ఖిద్మత్ సేవలు తెలుసుకోవడానికి ఎన్టీఆర్ షాది ఖానా కు తరలి రావాల్సిందిగా నవాజ్ ఖాన్ కోరారు. సమావేశంలో బ్రాంచి సభ్యులు ఎస్.అబ్దుల్లా, ఎన్ ఎండి ఆసిఫ్, సీ.యం. జకరియా, పీవి ముస్తఫా, అబ్దుల్ అలీం, మేనేజర్ ఫయాజ్, అకౌంటెంట్ నూరుల్ హఖ్, బద్రూ పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button