
బిజిడిఎస్ జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన డి.చంద్రశేఖర్ కు సన్మానం
బిజిడిఎస్ జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన డి.చంద్రశేఖర్ కు సన్మానం
కోసిగి (పల్లెవేలుగు) బిజిడిఎస్ జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన డి.చంద్రశేఖర్ కు స్థానిక స్త్రీ శక్తి భవనంలో శుక్రవారం ఏపీయూడబ్ల్యూజే ఆద్వర్యంలో సన్మాన కార్యక్రమం చేశారు. మండల అధ్యక్షులు వి.షబ్బీర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీయుడబ్యూజే జిల్లా సహయ కార్యదర్శి హనుమేష్, మండల అధ్యక్షులు వి.షబ్బీర్ , గౌరవ అధ్యక్షులు గడ్డం ఈరన్న , సీనియర్ విలేకరి శ్రీరాములు లు మాట్లాడుతూ అల్ ఇండియా జనరల్ సెక్రటరీగా మారుమూల రాయలసీమ పశ్చిమ ప్రాంతమైన కోసిగి గ్రామవాసి చంద్రశేఖర్ ఎన్నిక కావడం హర్షించదగ్గ విషయం అన్నారు. స్థానిక తపాల కార్యక్రమంలో పనిచేస్తున్నందుకు మనందరికీ గర్వకారణమని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. అనంతరం సన్మాన గ్రహీత చంద్రశేఖర్ మాట్లాడుతూ 160 సంవత్సరాల చరిత్రగల పోస్టల్ వ్యవస్థ అని,అందులో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై దృష్టి సారించడం జరుగుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఈడీ ఉద్యోస్తులను రెగ్యులర్ చేయాలని డిమాండుతో ముందుకు పోవడం జరుగుతుందని, అందుకు అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో కోసిగి ఏపియూడబ్ల్యూజే నాయకులు కోశాధికారి నాగరాజు, రాజేష్ ,మధు, రఘు, ప్రవీణ్ , బాబు, లక్ష్మన్న, నాగరాజు, ఈరన్న, సతీష్, రంగస్వామి, యూసుఫ్, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.