nandyala

బాల అకాడమీ పాఠశాల యందు ఘనంగా జరిగిన సరోజినీ నాయుడు జయంతి కార్యక్రమాలు

బాల అకాడమీ పాఠశాల యందు ఘనంగా జరిగిన సరోజినీ నాయుడు జయంతి కార్యక్రమాలు

నంద్యాల (పల్లెవేలుగు) 13ఫెబ్రవరి: పట్టణంలోని పార్క్ రోడ్డు సమీపంలో గల బాల అకాడమీ పాఠశాలలో ఈ రోజు అనగా సోమవారం 13వ తేదీన సరోజినీ నాయుడు జయంతి కార్యక్రమాలను ఏర్పాటు చేసి జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల కరస్పాండెంట్ ఎం.జి.వి. రవీంద్రనాథ్, ప్రిన్సిపల్ మాధవీలత  మాట్లాడుతూ స్త్రీలలో చక్కగా పాడేవారు కవిత్వం రాసేవారు అనేక భాషలు మాట్లాడేవారు ఇన్ని గుణాలు ఒక్కరిలోనే ఉన్నవారు ఎవరంటే ఆవిడే సరోజినీ దేవి ఈమె బెంగాలీ కుటుంబానికి చెందినది. ఫిబ్రవరి 13,1879 వ సంవత్సరంలో హైదరాబాద్ నందు జన్మించారు. తల్లి వరద సుందరీ దేవి, తండ్రి అఘోరనాథ్ గారు ఈమె 13 సంవత్సరాలకే 13 పంక్తుల కవితలను రాసింది.ఈమె ధ్వని  కోకిల గానంలా ఉండేది. అందుకే ఆమెను “భారత కోకిల” అనే వారని తెలియజేశారు. పాఠశాల చిన్నారి సరోజినీ నాయుడు వేషధారణతో అలంకరించుకొని అందరిని అబ్బురపరిచినది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎం.జి.వి. రవీంద్రనాథ్ ప్రిన్సిపల్ మాధవీలత ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button