nandyala

బాల అకాడమీ పాఠశాలలో జరిగిన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం

బాల అకాడమీ పాఠశాలలో జరిగిన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం

నంద్యాల (పల్లెవేలుగు) 03 డిసెంబర్: పట్టణములోని పార్కు రోడ్డు సమీపంలో గల బాల అకాడమీ పాఠశాలలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంను ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ M. G. V.రవీంద్రనాథ్, ప్రిన్సిపల్ మాధవీలత మేడం మాట్లాడుతూ మనిషి శరీరంలోని లోపం ఉన్న వారిని వికలాంగులు అంటారు. వీరికి చేయూతనందిస్తూ ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉన్నది వికలాంగుల ఉన్నతికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఐక్యరాజ్యసమితి వీరి కోసం 1992లో ప్రత్యేకంగా ఒక తీర్మానం ప్రవేశపెట్టింది దాని ప్రకారం ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం జరుపుకుంటున్నాము రాజకీయ, సామాజిక,ఆర్థిక, సాంస్కృతిక పరంగా వికలాంగుల ఎదుగుదలను ప్రోత్సహించేలా ఈ దినోత్సవం ప్రయత్నం చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ M.G.V.రవీంద్రనాథ్, ప్రిన్సిపల్ మాధవీలత మరియు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button