nandyala

బాల అకాడమీ పాఠశాలలో చిన్నారులచే ఘనంగా జరుపుకున్న గ్రీన్ కలర్ ఆక్టివిటీ

బాల అకాడమీ పాఠశాలలో చిన్నారులచే ఘనంగా జరుపుకున్న గ్రీన్ కలర్ ఆక్టివిటీ

నంద్యాల పట్టణంలోని పార్కురోడ్డు సమీపంలో గల బాల అకాడమీ సిల్వర్ ఓక్స్ నందు 17/12/2022 న అనగా శనివారము పాఠశాల చిన్నారులచే గ్రీన్ కలర్ ఆక్టివిటీ ని జరుపుకోవడం జరిగినది.ఈ కార్యక్రమంలో పాఠశాల చిన్నారుల ఆకుపచ్చ దుస్తులు ధరించి,వివిధ రకాల పండ్లు, కూరగాయలు మరియు బొమ్మలు తెచ్చి అలంకరించారు.చిన్నారులు నీలిరంగు మరియు పసుపుపచ్చ రంగు కలిపి ఆకుపచ్చ రంగు తయారు చేశారు.ఎక్కడ చూసిన పచ్చదనమే కనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎం.జి.వి.రవీంద్రనాథ్ సార్ గారు ప్రిన్సిపల్ శ్రీమతి మాధవీ లత మేడమ్ గారు మాట్లాడుతూ ఆకుపచ్చ రంగు పాడి పంటలకు ప్రతీక ఆకుపచ్చ రంగు సరైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఈ రంగు ఎదుగుదలకు నిలకడకు గుర్తు ఆరోగ్యపరంగా ఆకుపచ్చ రంగు ఎంతో మేలు చేస్తుంది. ఆకుపచ్చ రంగు నుండి వచ్చే కాంతి కిరణాలు కళ్ళకు చలువచేస్తాయి. ఈ రంగు ఎన్నో రకాల వ్యాధులను అరికడుతుంది. ఆకుపచ్చ రంగు హృదయ చక్రాన్ని సూచిస్తుంది. ఈ రంగు తేజోశ్చక్రం ఉన్న వారిలో విజ్ఞాన ఆసక్తి ఉంటుంది. పర్యావరణాన్ని కాపాడే శక్తి కూడా ఆకుపచ్చ రంగుకు ఉంటుంది అని ప్రకృతి మనకు చెబుతుంది అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరంస్పాండెంట్ ఎం.జి. వి. రవీంద్రనాథ్ సార్ గారు ప్రిన్సిపల్ మాధవీలత మేడమ్ గారు మరియు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button