nandyala

బాల అకాడమీ పాఠశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు

బాల అకాడమీ పాఠశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు

నంద్యాల (పల్లెవేలుగ) 11 బుధవారం;  పట్టణంలోని పార్క్ రోడ్డు సమీపంలో గల బాల అకాడమీ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలను  మంగళవారం ఘనం జరుపుకున్నారు.  మొదటగా ఈ కార్యక్రమాన్ని కరెస్పాండెంట్ ఎం.జి.వి. రవీంద్రనాథ్, ప్రిన్సిపల్ మాధవీలత ప్రారంభించారు. సంక్రాంతి పండుగ ఉట్టిపడే  వాతావరణంతో పాఠశాల ఆవరణము కళకళలాడింది రంగురంగుల రంగవల్లులతో పల్లె వాతావరణము తలపించే పూరి గుడిసె భోగిమంటలు సాంప్రదాయ వస్త్రధారణతో చిన్నారులు అందరిని మురిపించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్ ఎం.జి.వి.రవీంద్రనాథ్ మాట్లాడుతూ తెలుగువారు జరుపుకునే ముచ్చటైన మూడు రోజుల పండుగ సంక్రాంతి అని దీనిని రైతుల పండుగ అని కూడా అంటారని ఎందుకంటే శ్రమకు ఫలితం ధాన్య లక్ష్మీ రూపంలో ఇంటికి చేరుతుందని తెలిపారు. కొత్త బియ్యంతో పొంగలి అరిసెలు చేసే ప్రాణకోటికి ఆధారమైన సూర్యభగవానునికి నైవేద్యం సమర్పిస్తారని తెలిపారు. ప్రిన్సిపల్ మాధవీలత  మాట్లాడుతూ పెద్దలకు పిల్లలకు నచ్చే నవ క్రాంతి సంక్రాంతి అని, మగువలు నచ్చే ముగ్గుల పండగ అని, బోసి నవ్వులతో ముద్దు ముద్దుగా మురిపించే ముద్దు పాపాయిలకు పోసే భోగిపల్ల పండుగని ,శ్రీ లక్ష్మీ కొలువుదీరే అందరి జీవితాలలో కాంతులతో నింపే పండుగ సంక్రాంతి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ,విద్యార్థులు మరియు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button