nandyala

బాల అకాడమీ పాఠశాలలో ఘనంగా జరుపుకున్న గణిత దినోత్సవపు వేడుకలు

బాల అకాడమీ పాఠశాలలో ఘనంగా జరుపుకున్న గణిత దినోత్సవపు వేడుకలు

నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్డు సమీపంలో గల బాల అకాడమీ పాఠశాలలో డిసెంబర్ 22 వ తేదీన ఘనంగా గణిత దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావుస్ కళాశాల అధినేత  అప్పారావు మరియు రావుస్ కళాశాల ప్రిన్సిపల్ సుంకయ్య,  మ్యాథమెటిక్స్ హెచ్. ఓ .డి. రఘురాం హాజరయ్యారు. శ్రీనివాస రామానుజన్ గారి చిత్రపటానికి పూలమాలతో అలంకరించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు అప్పారావు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ అతి సామాన్య కుటుంబంలో జన్మించి అతి చిన్న వయసులోనే 32 సంవత్సరాల లోని గణిత శాస్త్రవేత్తగా ప్రఖ్యాతిని పొందారు ఆయన మరి కొంతకాలం జీవించి ఉంటే మన భారతదేశాన్ని ఉన్నత స్థానంలోనికి తీసుకుని వెళ్ళగలిగే వారని తెలియజేశారు. పాఠశాల కరస్పాండెంట్ ఎం. జి. వి. రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్  మాధవీలత మేడం మాట్లాడుతూ ప్రముఖ  భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ మైసూర్ రాష్ట్రంలో 1887 డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈయన జన్మదిన సందర్భంగా నేడు ఈ జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటున్నాము. అతను స్వచ్ఛమైన గణితంలో దాదాపు అధికారిక శిక్షణ లేకపోయినా అతను గణిత విశ్లేషణకు గణనీయమైన కృషి చేశారు గణిత సమస్యలను పరిష్కరించారు. నాకు ఒక సమీకరణం భగవంతుని ఆలోచనను వ్యక్తపరుస్తూనే తప్ప అర్థం కాదు అని అనేవారు 2012లో భారతీయ స్టాంపులో శ్రీనివాస రామానుజన్  ఉన్నారు. 2017 లో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులోని కుప్పంలో రామానుజన్ మఠం పార్కును ప్రారంభించారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు గణితమునకు సంబంధించిన అనేక ఆక్టివిటీలను, ప్రాజెక్టులను చేసి విచ్చేసిన అతిధులకు మరియు తల్లిదండ్రులకు చక్కగా వారి వారి ప్రాజెక్టులను గురించి వివరించి వారి ప్రతిభను తెలియజేసుకున్నారు ముఖ్య అతిథులు మరియు తల్లిదండ్రులు పాఠశాల చిన్నారుల ప్రతిభను అభినందించారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button