nandyala

బాల అకాడమీలో ఘనంగా జరిగిన ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం

బాల అకాడమీలో ఘనంగా జరిగిన ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం

నంద్యాల (పల్లెవేలుగు) 03 ఫెబ్రవరి:  పట్టణంలోని పార్క్ రోడ్డు సమీపంలో గల బాల అకాడమీ పాఠశాల నందు ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవంను పురస్కరించుకొని విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించడం జరిగినది. ఈ సదస్సుకు ముఖ్య వక్తలుగా పాఠశాల కరస్పాండెంట్ ఎం.జీ.వి. రవీంద్రనాథ్ ప్రిన్సిపల్ మాధవీలత మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల దినోత్సవం జరుపుకుంటామని భూమిపై ప్రాణకోటి మనుగడకు చిత్తడి నేలలు మూలమని ఈ చిత్తడి నేలలను భూమికి ఉన్న మూత్రపిండాలు అని కూడా అంటారని ఇవి నీటి వనరులకు మంచి నీటికి మూలాలుగా ఉన్నాయని ఉపరితలం నుంచి వ్యర్థాలను చిత్తడి నేలలు శుద్ధి చేస్తాయని మన దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఇది 4.63%వరకు ఉన్నాయని వీటిని పరిరక్షించాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం యునెస్కో ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుందని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన చిత్రపటాలు, నినాదాలు, రోల్ ప్లేలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎం.జీ.వి. రవీంద్రనాథ్, ప్రిన్సిపల్ మాధవీలత,  ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button