
YSR KADAPA
బాలుడి అదృశ్యం పై కేసు నమోదు.
బాలుడి అదృశ్యం పై కేసు నమోదు.
ఎర్రగుంట్ల (పల్లె వెలుగు) జనవరి 9:ఎర్రగుంట్ల స్థానిక క్రిస్టియన్ లైన్ లో చక్ర కోళ్ల ప్రశాంత్ చరణ్ కుమార్ అనే బాలుడు అదృశ్యమైనట్లు అర్బన్ సీఐ మంజునాథ రెడ్డి తెలిపారు పోలీసులు తెలిపిన వివరాల మేరకు. ఎర్రగుంట్ల లోని క్రిస్టియన్ లైన్ లో నివాసం ఉంటున్న చక్ర కోళ్ల సంపత్ కుమార్ కుమారుడు చక్ర కోళ్ల ప్రశాంత్ చరణ్ కుమార్ సోమవారం ఉదయం నుండి ఇంటి నుండి బయటికి వెళ్లి తిరిగి రాలేదని తండ్రి మందలించడంతో ఇంటి నుండి ప్రశాంత్ చరణ్ వెళ్ళిపోయాడని బంధువులు స్నేహితుల నివాసాల్లో వెతికిన ఫలితం లేకపోవడంతో బాలుడి తండ్రి సోమవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు అదృశ్యం కేసు నమోదు చేసినా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు ఎవరికైనా ఆచూకీ తెలిస్తే ఈ నెంబర్ 9121100530 కు సమాచారం అందించాలని ఆయన కోరారు.