panyam

బాదుడే బాదుడు కార్యక్రమానికి బ్రహ్మరథం

  • బాదుడే బాదుడు కార్యక్రమానికి బ్రహ్మరథం
  • పట్టిన ప్రజలు సంక్షేమ పథకాలతో ప్రజల ను మోసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
  • నిరుద్యోగులు పెరిగిన ధరలు, అభివృద్ధి సుణ్యం,

పాణ్యం  (పల్లెవెలుగు) 14 అక్టోబర్: నియోజకవర్గం లోని పాణ్యం మండలంలోని పిన్నాపురం గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు గ్రామంలో ఇంటింటికీ తిరిగి కరపత్రాలు అందజేస్తున్న పాణ్యo నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి గౌరు చరిత రెడ్డి . ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే  గౌరు చరిత రెడ్డి  మాట్లాడుతూ ఈ గ్రామంలో ముఖ్యంగా వీధి లైట్లు మరియు రోడ్లు, డ్రైనేజీ కాలువలు లేక ఇంటి ముందు డ్రైనేజీ మురికి నీళ్లతో ఇబ్బంది పడుతున్నo అని సోలార్ కంపెనీ వాళ్ళు ఈ మురికి కాలువలలో గ్రావెల్ మట్టి వేయడంతో వానలకు బురద ఎక్కువయి కింద పడి చాలా మంది ఇబ్బందికి గురి అయ్యారని అంతే కాకుండా ముఖ్యంగా, త్రాగు నీటి సమస్య తో ఇబ్బంది పడుతున్నాం అని, గ్రామ ప్రజలు మా దృష్టికి  తెలుపడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం లో ఈ నియోజకవర్గంలో మరియు ఈ గ్రామంలో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు, గత టీడీపీ ప్రభుత్వం లో అభివృద్ధి పనులతో పాటు సంక్ష్మేమ పథకాలు ప్రజలందరికీ అందజేసిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడుకే సాధ్యం అని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు నాయుడును బల పరిచేందుకు ముందుకొస్తున్న ప్రతి ఒక్కరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. 2019 ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ జగన్ రెడ్డికి మద్దతు పలికారు, చంద్రబాబు నాయుడు కంటే ఆయన ఎక్కువ మేలు చేస్తారని ఆశించారు. గతంలో జగన్ రెడ్డి వైపు మొగ్గుచూపిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు పరిస్థితులను అర్థం చేసుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశంతో కలిసి నడవాలను కోవడం శుభపరిణామం అన్నారు. ఈ రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది అని తెలిపారు. అంతేకాకుండా నవరత్నాలు, బటన్ నొక్కడాలు తప్ప గతంలో అమలులో ఉన్న అనేక సంక్షేమ పథకాలకు జగన్ రెడ్డి చరమగీతం పాడేశారు. పండగ, పెళ్లి కానుకలు, బీమాలు, వివిధ కార్పొరేషన్ల రుణాలు వంటివి ఎన్నో పథకాలే గాక కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా లేకుండా చేసేశారన్నారు. రైతులకు కోసం గతంలో అమలైన ఎన్నో పథకాలు ఈ రోజు కనిపించడం లేదు అని ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు ఏ రోజు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీకి పట్టంకట్టి చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ప్రజల నాడిని గమనించిన జగన్ రెడ్డి తట్టుకోలేని పరిస్థితుల్లో అరాచకాలు సృష్టిస్తున్నారు. అక్రమ కేసులు, దాడులు, హత్యలు, మానభంగాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షుడు జయరామి రెడ్డి, గ్రామస్థులు వెంకటరమణ, జి వెంకట రమణ, విజయ్, తిరుమల నాయుడు, కందికాయ పల్లె వెంకట రమణ, మండల నాయకులు రమణ మూర్తి, సునీల్ రెడ్డి, రాంపుల్ల రెడ్డి, సుబ్బారెడ్డి,శివ శంకర్ రెడ్డి, ఎంపీటీసీ రంగ రమేష్, మాజీ ఎంపీటీసీలు సుభాన్, మాజీ ఎంపీపీ నారాయణమ్మ, ఆలమూరు చంద్ర శేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, అమరసింహ రెడ్డి, కందికాయపల్లే ఈశ్వర్, గొరుకల్లు సురేష్, వెంకటేష్, రవి కుమార్ మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు టీడీపీ అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Back to top button