
బడుగు బలహీన వర్గాల అభివృద్దే వైసీపీ ప్రభుత్వ ద్యేయం
బడుగు బలహీన వర్గాల అభివృద్దే వైసీపీ ప్రభుత్వ ద్యేయం
కోసిగి లో గడప గడపకు మన ప్రభుత్వం కు విశేష స్పందన రాష్ట్రంలో ని బడుగు, బలహీన వర్గాల అభివృద్దే వైసీపీ ప్రభుత్వ ద్యేయమని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అందుకోసమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకం ప్రవేశ పెట్టడం జరిగిందని ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి అన్నారు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన కోసిగి లో వైయస్సార్సీపి మండల ఇన్చార్జి మురళి రెడ్డి తో కలసి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపాల్గొన్నారు.కోసిగి రెండో సచివాలయం పరిధిలోని ప్రతి గడపకు వెళ్లి ప్రతి ఒక సంక్షేమ పథకాన్ని క్షుణ్ణంగా వివరించి ప్రతి అవ్వకు ప్రతి అమ్మకు ప్రతి తాతకు చెప్పడం జరిగింది.అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా ఏ పథకం మీకు రాకపోతే వెంటనే మాకు తెలియజేయాల్సిందిగా ఎమ్మెల్యే వై బాల నాగిరెడ్డి ప్రజలను కోరారు.కోసిగిలో ప్రజలు ఎంఎల్ ఏ బాలనాగిరెడ్డి కి అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ నీరాజనాలు పలికారు.ప్రతి ఇంటింటికి జగనన్న పథకాలు అందుతుండడం తో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఆలాగే మఠం స్కూల్లో అదనపు గదుల నిర్మాణం కు భూమి పూజ చేశారు. అనంతరం కోసిగి లోని రెండో సచివాలయం ను ఆయన సందర్శించి పనిచేస్తున్న సచివాలయం సిబ్బంది, వాలంటరీలకు పలు సూచనలు చేశారు. సక్రమంగా పనిచేయాలని లేని పక్షంలో చర్యలు తప్పవన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అందే విధంగా చూడాలని ఏ ఒక్క పథకం వారికి చేరకపోయిన దానికి సంబంధించి వెంటనే నివేదిక తయారు చేసి అందించాలని ఆయన వాలంటీర్లను కోరారు..అనంతరం సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లవకుశ ఈరన్న, సర్పంచ్ అయ్యమ్మ, ఆర్లబండ సొసైటీ అధ్యక్షుడు మహాంతేష్ స్వామి , వైసీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి నాగరాజు, మంగమ్మ జగదీష్ స్వామి, సౌకడ్ భాష అధికారులు తహశీల్దార్ రుద్రగౌడ్, వెలుగు, సిబ్బంది, సచివాలయం సిబ్బంది.హౌసింగ్ సిబ్బంది, వాలేంటీర్లు.తదితరులు పాల్గొన్నారు.