
బడిలో ఉండాల్సిన విద్యార్థులు పనీలో కుటుంబం భారంతో వలస పయనం
బడిలో ఉండాల్సిన విద్యార్థులు పనీలో కుటుంబం భారంతో వలస పయనం
కోసిగి (పల్లెవేలుగు) 10 నవంబర్: మండలంలో వలసలు ఆగడం లేదు ఉపాధి కల్పిస్తామన్న మాటలు వలసలు నివారించాలన్న తీర్మానాలు ఏమయ్యాయో గాని గ్రామీణ బాలలు బడి వదిలి వలస దారి పడుతున్నారు. పిల్లలు బడిలో పెద్దలు పనిలో, పలుగు పారా వీడండి. పలక బలపం పట్టంది. అన్న ప్రభుత్వ నినాదాలు గోడలకే పరిమిత మైపోయాయి. చేతికొచ్చిన పంటలు అధిక వర్షాల వల్ల నష్టపోవడం దానికి తోడు నష్టపరిహారం అందక చేసిన అప్పులు తీర్చలేని స్థితిలో పిల్లా జల్లా కలిసి మూటమల్ల సర్దుకొని ఇతర రాష్ట్రాలకు కూలి పని నిమిత్తం బయలు దేరుతున్నారు. ఉపాధ్యాయులు బడి పిల్లలను వలస నిమిత్తం తీసుకుని వెళ్లరాదని తల్లిదండ్రులకు ఎన్నిసార్లు చెప్పినా, పిల్లలను వదిలి వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రజలు.వలస వెళ్లే దారిలో గత సంవత్సరం ప్రమాదం జరిగి తమ తోటి సహోచారులే మరణించినప్పటికీ చేసేదేమీలేక దేవునిపై భారం వేసి వలస బండి ఎక్కుతున్నారు. తమ తోటి విద్యార్థులు బడి వదిలి వలస పోవడాన్ని చూసి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మిగతా విద్యార్థులు పదవ తరగతి చదివే విద్యార్థులను సహితం వలస నిమిత్తం తీసుకుని వెళుతున్నారు. కోసిగి మండలం దుద్ది గ్రామంలో (40%) అంటే సుమారు 100 మంది విద్యార్థులు వలస బాట పట్టినట్లు ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వలసలు నివారణకు తగిన చర్యలు తీసుకుని విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని ప్రజలు ఆశిస్తున్నారు.