Dharmavaram

ఫ్లెక్సీల చించివేత దారుణం – తెలుగుదేశం పార్టీ నాయకులు

ఫ్లెక్సీల చించివేత దారుణం – తెలుగుదేశం పార్టీ నాయకులు

ధర్మవరం (పల్లె వెలుగు) సెప్టెంబర్ 23:  తెలుగుదేశం పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ జన్మదిన వేడుకల సందర్భంగా పట్టణంలో పలుచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా వాటిని చించివేత కార్యక్రమం నిర్వహించడం అత్యంత దారుణమని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు మాట్లాడుతూ ఫ్లెక్సీల చించివేత, మంచి సంస్కృతి కాదని తెలుపుతూ తీవ్ర స్థాయిలో టిడిపి శ్రేణులు మండిపడ్డారు. తదుపరి టిడిపి నాయకులు డిఎస్పి రమాకాంత్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, ఫ్లెక్సీ ని చించిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని, కేసును కూడా నమోదు చేయాలని వారు ఫిర్యాదు చేశారు. టిడిపి నాయకులు మాట్లాడుతూ చేతనైతే మమ్మల్ని ఎదుర్కోవాలి కానీ, ఇలా చేతగానితనంగా ఫ్రిక్సీలను చించి వేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఇలాంటి సంస్కృతి ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేదని కేవలం ధర్మవరంలోనే కొనసాగడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. పోలీసులు వీటిని సీరియస్గా తీసుకొని, సీసీ ఫుటేజ్ లను చూసి, నిందితులను శిక్షించాలని తెలిపారు. మరి పోలీసులు రెండు రోజులు గడుస్తున్న సీసీ ఫుటేజ్ లను గూర్చి పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పురుషోత్తం గౌడ్, పరిసే సుధాకర్, నాగూర్ హుస్సేన్, అంబటి సనత్, రాళ్లపల్లి షరీఫ్, పఠాన్ బాబు ఖాన్, గోషాల శ్రీరాములు, కేతినేని రాజా, తెలుగు మహిళలు పాల్గొన్నారు. హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం తెలుగుజాతికి అవమానం హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్సార్ గా మార్చడం తెలుగుజాతిని అవమానపరచడమేనని టిడిపి నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం పాండురంగ సర్కిల్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు చేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాము వ్యతిరేకిస్తున్నామని, ఎన్టీఆర్ హయాంలో వైద్యరంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు మెడికల్ కళాశాలలను ఒకే పరిధిలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని వారు గుర్తు చేశారు. వెంటనే ప్రభుత్వం వైయస్సార్ పేరుని తొలగించి, ఎన్టీఆర్ పేరును యధాతంగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం గౌడ్, నాగురు హుస్సేన్, రాళ్లపల్లి షరీఫ్, పఠాన్ బాబు ఖాన్,గోశాల శ్రీరాములు, కేతినేని రాజా, తెలుగు మహిళలు పాల్గొన్నారు.

chiranjeevi

Chiranjeevi Reporter,Dharmavaram, Satyasai District
Back to top button