Uncategorized

ఫ్యామిలీ డాక్టర్ తో పల్లె ప్రజల ఇంటి ముంగిటే వైద్య సేవలు  మండల ఇంచార్జీ మురళీ మోహన్ రెడ్డి

ఫ్యామిలీ డాక్టర్ తో పల్లె ప్రజల ఇంటి ముంగిటే వైద్య సేవలు  మండల ఇంచార్జీ మురళీ మోహన్ రెడ్డి

కోసిగి (పల్లెవేలుగు) 21 అక్టోబర్: గ్రామీణ ప్రాంత ప్రజలు వైద్య సేవలు కోసం పి యచ్ సి, పెద్దాసుపత్రి లేదా ప్రైవేటు ఆసుపత్రిలకు వెళ్ళకుండా సియం జగనన్న దూరదృష్టితో ఆలోచించి, ఫ్యామిలీ డాక్టర్ తో పల్లె ప్రజల ఇంటి ముంగిటే వైద్య సేవలు అందివ్వడం జరుగుతుందని మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డి అన్నారు.శుక్రవారం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రము కోసిగిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు డాక్టర్ మనోజ్ కుమార్ అధ్యక్షతన 104 వాహనం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఇంచార్జీ మురళీ రెడ్డి పాల్గొన్నారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ,ప్రజలు, వైద్యుల మధ్య బంధం పెంపోందించేకు ఫ్యామిలీ డాక్టర్ తో మరింతగా మెరుగుపరిచేందుకు దోహద పడుతుందని,ఇందులో ఆశావర్కర్లు,ఎ యన్ యం ల సేవలు కీలకమైనవని,ఇది ట్రయల్ రన్ మాత్రమే, ఇందులో తప్పోఒప్పులను గుర్తించి,సంక్రాంతి లేదా ఉగాదికి లాంచనంగా ప్రారంబించబడుతుందని తెలిపారు.ఈకార్యక్రమంలో డాక్టర్ జియాజ్ బేగం,యంపీపీ ఈరన్న,సింగిల్ విండో అధ్యక్షులు మహాంతేష్ స్వామి, యన్ నాగరాజు,మాణిక్య రాజు,వి వెంకటేష్,పి నాగేష్, బుళ్ళి నరసింహులు,లోకరెడ్డి, పి.వెంకటేష్,ఆసుపత్రి వైద్యులు,సిబ్బంది మరియు ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Mohammad Yousuf

Mohammad Yousuf Reporter, Kosigi, Kurnool DIst
Back to top button