
ప్రారంభమైన 96వ ఉరుసు వేడుకలు
ప్రారంభమైన 96వ ఉరుసు వేడుకలు
ధర్మవరం పల్లె వెలుగు పట్టణంలోని చెరువు కట్ట వద్ద గల ధర్మవరం సయ్యద్ మహమ్మద్ షా ఖాదర్ వలీ రహమతుల్లా వారి 96వ ఉరుసు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మొదటి రోజు శనివారం రాత్రి గంధమును ఎద్దుల బండిలో పూల అలంకరణలో గావించబడిన వాటిని పట్టణ పురవీధుల గుండా ఊరేగించి, వాయిద్యాల నడుమ తిరిగి దర్గాకు చేరుకొని మజరే షరీఫ్ కు గంధం ఎక్కించారు. అనంతరం ప్రత్యేక పూజలను చేశారు. తదుపరి ఆదివారం వేద పండితులచే ఉరుసు వేడుకల గురించి సమాధులైన వలి అల్లాల గూర్చి ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం దర్గా కమిటీ అధ్యక్షులు కాజా హుస్సేన్-దర్గా జాగిర్ధర్, ప్రధాన కార్యదర్శి హైదర్ వలీ, గౌరవాధ్యక్షులు సోలిగాల చిన్న వెంకటేశులు, సహ కార్య దర్శి సబ్జాన్, వెల్దుర్తి బాబా ఫక్రుద్దీన్, ఉపాధ్యక్షులు మహబూబ్ అలీ, కోశాధికారి ముక్తియార్ తో పాటు సభ్యులు రోషన్, జమీర్ అండ్ బ్రదర్స్, పొద్దుటూరు నూర్ అహ్మద్, బాబావలి, జబీవు ల్లా, హాజ్ వలీ, ఆల్ హజ్ కాజా హుస్సేన్, మెహబూబ్ వలి, ఖాదర్ వలీ, అజ్జు, షాషావలి, దర్గా ముజావర్ ఖాద్రీ నవాజ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలు సోమవారంతో ముగుస్తాయని తెలిపారు.