Dharmavaram

ప్రారంభమైన భక్త మార్కండేయ స్వామి ఉత్సవ విగ్రహ పూజా వేడుకలు

ప్రారంభమైన భక్త మార్కండేయ స్వామి ఉత్సవ విగ్రహ పూజా వేడుకలు

ధర్మవరం (పల్లె వెలుగు) 30 నవంబర్: పట్టణములోని మార్కెట్ వీధిలో గల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో ఈనెల 30వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు నిర్వహించబడే భక్త మార్కండేయ స్వామి నూతన ఉత్సవ విగ్రహ పూజా వేడుకలు అత్యంత వైభవంగా, వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ బుధవారం సాయంత్రం ఘనంగా శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం అధ్యక్షులు జక్కా చిన్న సింగరయ్య, ఉపాధ్యక్షులు జింక రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి జింక చిన్నప్ప, కమిటీ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి నుండి వైష్ణవ, శైవాహ, స్మార్త పురోహితులను 25 మందిని పిలిపించి, పూజా కార్యక్రమాలను ఘనంగా భక్తాదుల నడుమ నిర్వహించారు. దేవాలయ ప్రాంగణము తో పాటు ముఖ్యమైన పట్టణ కూడలిలో విద్యుత్ దీపాలంకరణ గావించారు. శివుడిని భక్త మార్కండేయ ఆలింగణం చేసుకున్న విద్యుత్ దీపాలంకరణ పట్టణ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. పద్మశాలీల కులదైవంగా పూజింపబడుతూ చేనేత కుటుంబాల కొంగుబంగారమైన శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన రుషింద్రుల వారి దేవాలయంలో ఆలయ శిఖర, గర్భాలయ, ముఖ మండప ,రాజా గోపురముతో సర్వాంగ సుందరముగా కమిటీ ఆధ్వర్యంలో చేయించడం జరిగింది. తొలుత అర్చకులు విశ్వకేశన ఆరాధనం, పుణ్యాహవాచనం, అజస్త్ర దీపారాధన, మత్సరం గ్రహణం, అంకురార్పణం పూజలను నిర్వహించారు. ఈ వేడుకలు డిసెంబర్ 4వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని దేవాలయ అధ్యక్షులు తెలిపారు. అనంతరం శ్రీ అన్నమయ్య సేవా మండలి వారి ఆధ్వర్యంలో పొరాల పుల్లయ్య శిష్య బృందం చే శివ సాయి యోగ మహిళా బృందం వారిచే నిర్వహించబడిన కోలాటం, సాంస్కృతిక కార్యక్రమం అందరిని అలరింపజేశాయి. ఈ కార్యక్రమంలో సంగం ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, కార్యనిర్వాహక సభ్యులు, ప్రచార కార్యదర్శులు, డైరెక్టర్లు ,అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.

chiranjeevi

Chiranjeevi Reporter,Dharmavaram, Satyasai District
Back to top button