Allagadda

ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక 2023 పై శిక్షణ కార్యక్రమం

ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక 2023 పై శిక్షణ కార్యక్రమం

ఆళ్లగడ్డ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం గ్రామీణ ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక 2023 పై సర్పంచులు ప్రజాప్రతినిధులకు ఎంపీటీసీలకు శిక్షణ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. మండల పరిషత్ అధ్యక్షుడు గజ్జల రాఘవేంద్ర రెడ్డి అధ్యక్షతన, ఎంపీడీవో సుబ్బారెడ్డి జలజీవన్ అధికారులు పాల్గొని శిక్షణ ఇచ్చారు. ఎన్ ఆర్ జి ఎస్ కింద మండలంలోని అన్ని గ్రామాలలో పంచాయతీలకు అవసరమైన వనరులు సమకూర్చుకొనుటకై అధికారులు కీలక అంశాలపై శిక్షణ ఇచ్చారు. మండలంలోని గ్రామపంచాయతీలు సర్పంచులు ఎంపీటీసీలు, గ్రామ కార్యదర్శులు ప్రభుత్వ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

sridhar

Sridhar Allagadda, Reporter, Nandyal Dist.
Back to top button