gadivemula

ప్రమాదాలకు కారకులు రైతన్న ఇదేం పనన్నా

  • ప్రమాదాలకు కారకులు రైతన్న ఇదేం పనన్నా
గడివేముల (పల్లెవేలుగు) 26 డిసెంబర్ : దేశానికి పట్టెడన్నం పెట్టే రైతులు ఆర్థిక ప్రగతికి రథచక్రాల సారథులు రైతులు. గిట్టుబాటు ధర లేక దళారీ వ్యవస్థను నమ్ముకుని ఏటా  మోసపోయిన వ్యవసాయాన్ని చేస్తూ కుదేలైనా రైతన్న ఇది ఒకప్పటి మాట ప్రస్తుత రైతు పరిస్థితి విభిన్నంగా ఉంది కల్లాలను పొలాలుగా మార్చి గట్ల మీద ఉన్న పచ్చని చెట్లు అమ్ముకుని ఏటా పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు అంతేగాక ధాన్యం ఆరబోత అంటూ రహదారులపై ఏడాదికి రెండు నెలలు తెలియకనో ప్రమాదాలకు కారకులు అవుతున్నారు రైతన్న ఇదేం పనన్నా అంటే చూసుకొని పోండి మా పరిస్థితి బాగాలేదు అంటూ దీర్ఘాలు తీస్తున్నారు మొత్తానికి గడివేముల మండలంలో ప్రధాన రహదారిపై ధాన్యం ఆరబోత నూర్పిళ్లు రహదారిపై లోడింగ్ ధాన్యంపై వాహనాలు వెళ్లకుండా నిలువున రాళ్లు అడ్డంగా పెడుతుండడంతో గత రెండు సంవత్సరాల నుంచి చిందుకూరు గడిగరేవుల తిరుపాడు గ్రామాలలో ఈరకంగా ధాన్య ఆరబోత వల్ల రోడ్డు ప్రమాదాల బారినపడి చనిపోయిన ద్విచక్ర వాహనదారులు ఉన్నారు.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రోడ్డుపై ధాన్యం ఆరబోత నేరం ఎవరైనా ప్రమాదానికి గురై చనిపోతే కారకులుగా తేల్చి వారి ద్వారా పరిహారం  ఇప్పించే బాధ్యత అధికారులదే .. అధికారులు జర దేఖో ప్రమాదాలు జరగకముందే నియంత్రించడానికి ప్రయత్నించండి ప్రమాదాలు జరిగాక కేసు రిజిస్టర్ కావడం వల్ల బాధిత కుటుంబాలకు ఏమి ఒరగదు
Back to top button