Dewanakonda

ప్రభుత్వ సబ్సిడీ వేరుశనగ కాయలను ఎకరానికి ఐదు బస్తాలు ఇవ్వాలి.

  • ప్రభుత్వ సబ్సిడీ వేరుశనగ కాయలను ఎకరానికి ఐదు బస్తాలు ఇవ్వాలి.
  • అడిగిన ప్రతిరైతుకు కొరత లేకుండా అందించాలి ఏపీ రైతుసంఘం

దేవనకొండ (ఆంధ్ర ప్రతిభ) 04 నవంబర్: రబీ సీజన్ నందు హంద్రీనీవా ద్వారా మరియు బోర్లు, బావుల దగ్గర వేరుశనగ సాగుకు అవసరమైన వేరుశెనగ కాయలను ప్రభుత్వం సబ్సిడీ క్రింద రైతులకు అవసరమైనన్ని ఇవ్వాలని ఏపీ రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం.జగదీష్, మండల అధ్యక్ష,కార్యదర్శులు ఇబ్రహీం, శివశంకర్ గౌడ్ లు ఒక ప్రకటన ద్వారా కోరారు. 2022 ఖరీఫ్ సీజన్ నందు అతివృష్టి, అనావృష్టి ద్వారా రైతులు సాగు చేసిన పత్తి, మిర్చి, టమోటో, సజ్జ, జొన్న, కంది, ఉల్లి ఇతర పంటలు అన్నీకూడా నాశనం అయ్యాయి అని అందువల్ల రైతు తీవ్రమైన నష్టం ఏర్పడింది అని అన్నారు. రబీ సీజన్ నందు పంటలు వేసుకోవడానికి రైతులకు ప్రభుత్వం సబ్సిడీ పై వేరుశెనగ,  పప్పుశనగ మరియు రైతుకోరిన ఇతరా విత్తనాలను రైతులకు సరిపడినంత ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఒక పాస్ పుస్తకానికి మూడు బస్తాలు ఇస్తున్నది. అయితే మూడు బస్తాలు రైతుకు సరిపోవడం లేదు. అందువల్ల బయట మార్కెట్ లో కొనాల్సిన పరిస్థితి ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో బయట మార్కెట్ నందు కొనే పరిస్థితి లో రైతు లేదు. ఖరీఫ్ సీజన్ నందు జరిగిన తీవ్ర నష్టానికి రైతులు అప్పుల కు వడ్డీ చెల్లించే పరిస్థితి లేదని అందుకని ప్రభుత్వం స్పందించి రైతులకు అవసరమైన పంట పండించుకోవడానికి ఎకరానికి 5 బస్తాలు ఇవ్వాలని కోరారు.

Back to top button