Dharmavaram

ప్రభుత్వ సంక్షేమ పథకాలు విద్యార్థులందరికీ అందడమే ప్రభుత్వము యొక్క లక్ష్యం… మున్సిపల్ వైస్ చైర్మన్ పెనుజూరు నాగరాజు

ప్రభుత్వ సంక్షేమ పథకాలు విద్యార్థులందరికీ అందడమే ప్రభుత్వము యొక్క లక్ష్యం… మున్సిపల్ వైస్ చైర్మన్ పెనుజూరు నాగరాజు

ధర్మవరం (పల్లెవెలుగు) 22 సెప్టెంబర్: నేడు ప్రభుత్వం విద్యార్థులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఆ పథకాలను విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ వైస్ చైర్మన్ పెనుజూరు నాగరాజు (సాయిరాం) తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో సాధన ఉన్నత పాఠశాలలో “జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో” భాగంగా విద్యార్థులందరికీ వారు ఆల్బెండజోల్ టాబ్లెట్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే తమ చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకోవడంతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచు కుంటే, ఆరోగ్యం పదిలంగా ఉంటుందన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్ ద్వారా ఈ కార్యక్రమ వివరాలను వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సీతాపతి, విద్యార్థులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

chiranjeevi

Chiranjeevi Reporter,Dharmavaram, Satyasai District
Back to top button