kosigimantralayam

ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘించి క్లాస్ లు నిర్వహిస్తున్న కోసిగి మౌంట్ కార్మెల్ హైస్కూ ను సీజ్ చేయాలి  ఏఐఎస్ఎఫ్

ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘించి క్లాస్ లు నిర్వహిస్తున్న కోసిగి మౌంట్ కార్మెల్ హైస్కూ ను సీజ్ చేయాలి  ఏఐఎస్ఎఫ్

ఏఐఎస్ఎఫ్ మంత్రాలయం తాలూకా అధ్యక్షుడు ఎస్. ఈరేష్ మాట్లాడుతూ సెలవు రోజు కుడా క్లాస్ ఎలా నిర్వహిస్తారు అని విద్యార్థి సంఘంగా మౌంట్ కార్మెల్ హై స్కూల్ యాజమాన్యన్ని ప్రశ్నించడానికి స్కూల్ లోపలికి వెళుతున్న విద్యార్థి సంఘ నాయకులను అక్కడ ఉన్న స్టాఫ్ తో విద్యార్థి నాయకులని చూడకుండా బయటకు వెళ్లిపోండి అని అడ్డు నిలబడి తోశారు అన్నారు. ఇదేంటి సార్ అని అడిగితే మీరు ఎవరికి  చెప్పుకుంటారో చెప్పుకోండి స్కూల్ బంద్ చేయడం కుదరదనీ అన్నారు వెంటనే విద్యాశాఖ అధికారులకు డిప్యూటీ డిఈఓ. డీఈఓ సిసికి ఫోన్ చేస్తే వారు వెంటనే  ఫోన్ లిఫ్ట్ చేసి స్పందించి వెంటనే మౌంట్ కార్మెల్ హై స్కూల్ యాజమాన్యంతో మాట్లాడుతాను అని చెప్పారు  విద్యాశాఖ అధికారి ఎన్ని సార్లు ఫోన్ చేసినా కూడా  మౌంట్ కార్మెల్ హై స్కూల్  యజమాన్యం ఫోన్ లిఫ్ట్ చేయలేదని విద్యాశాఖ అధికారులే తెలిపారు అన్నారు  మీరు రిప్రెటేషన్ ఇవ్వండి స్కూల్ యాజమాన్యం పై మేము చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు విద్యాశాఖ అధికారులు  చర్యలు తీసుకోలేని పక్షంనా ఉద్యమం ఉద్రిక్తం చేసి డిఈవో ఆఫీసును ముట్టడి చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి అంజి సహాయ కార్యదర్శి వీరేష్, అరవింద్, లక్ష్మారెడ్డి,పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు

Mohammad Yousuf

Mohammad Yousuf Reporter, Kosigi, Kurnool DIst
Back to top button