
ప్రభుత్వ ఉద్యోగం రాక రైలు కిందపడి నిరుద్యోగి మృతి
ప్రభుత్వ ఉద్యోగం రాక రైలు కిందపడి నిరుద్యోగి మృతి
ధర్మవరం (పల్లె వెలుగు) సెప్టెంబర్ 9: అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం వొడ్డిపల్లి గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి కుమారుడు హరి ప్రకాష్ రెడ్డి (29) తాను చదువుకున్న విద్యకు సరియైన ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో ఆదివారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మవరం జిఆర్పి పోలీసులు సోము విజయ్ కుమారులు మాట్లాడుతూ మృతుడు చదువు మీద మక్కువ ఎక్కువగా ఉండేదని, పదవ తరగతి డిగ్రీలో కూడా మంచి ప్రతిభతో కూడిన మార్పులను సంపాదించాడని, పై చదువులు చదవడానికి కుటుంబ పరిస్థితులు పేదరికం కావడంతో, నాన్నకు వ్యవసాయంపై సహాయంగా ఉంటూ జీవించేవాడు. అనంతరం తాను చదువుకున్న చదువుకు సరైన జాబు రాకపోవడం వ్యవసాయము కుటుంబ జీవనాధారం కోసం దాదాపు 20 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పు ఎలా తీర్చాలి అన్న వేదన ప్రతిరోజు మదనపడేవాడిని కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం ఉదయం ఓ పనిమీద వెళుతున్నానని ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలిపి వెళ్లిపోయాడు, అనంతరం శవంగా మిగిలాడన్న బాధను కుటుంబ సభ్యుల రోదన అందరినీ కలిసివేసింది. అనంతరం జి ఆర్ పి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, శవాన్ని పరిశీలించగా అతని ప్యాంటు జేబులో ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సును ఆధారంగా. చేసుకొని కుటుంబ సభ్యులకు సమాచారాన్ని ఇచ్చారు.శవాన్ని పోస్ట్మాస్టర్ నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.