
Dharmavaram
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు ,బిస్కెట్లు పంపిణీ
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు ,బిస్కెట్లు పంపిణీ
ధర్మవరం పల్లె వెలుగు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం నాడు దాదాపు 200 మంది రోగులకు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జన్మదిన వేడుకల సందర్భంగా బ్రెడ్డు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగిందని శివయ్య ఆచారి తెలిపారు. ఈ కార్యక్రమం పట్టణంలోని పాండురంగ స్వామి దేవాలయంలో గల శ్రీ సత్య సాయి భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు. దాతల సహకారంతోనే ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా దాతకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. తొలుత పట్టణంలో నగర సంకీర్తన కార్యక్రమములో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్య సాయి సేవ సమితి, సత్య సాయి భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.