
ప్రభుత్వం ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలను అందిస్తోంది… ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
ప్రభుత్వం ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలను అందిస్తోంది… ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
ధర్మవరం పల్లె వెలుగు ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను సచివాలయ వాలంటరీ వ్యవస్థ ద్వారా అర్హత గల వారందరికీ కూడా అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం మండల పరిధిలోని పోతుకుంట బృందావనం కాలనీ బీసీ కాలనీలలో గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటింటా తిరుగుతూ మూడున్నర సంవత్సరాల కాలంలో ప్రభుత్వం వలన కలిగిన లబ్ధిని వివరిస్తూ, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేకు ప్రజలు ఘనంగా ఆహ్వానం పలికారు. గ్రామాలలో సమస్యలను పరిష్కరించడానికి తాను గడపగడప కార్యక్రమానికి వస్తున్నానని, మొహమాటం లేకుండా ప్రజలు సమస్యలను తెలిపితే పరిష్కరించే దిశగా తాను కృషి చేస్తానని తెలిపారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా 95% నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. కుల మతాలకు పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ప్రజలు కూడా వారి వెంటే ఉన్నారని వారు తెలిపారు. ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలలో ఇళ్లను నిర్మించుకున్న వారు ఆ ఇళ్లల్లోనే నివాసం ఉండాలని అద్దెకు ఇవ్వరాదని వారు సూచించారు. ఈ కార్యక్రమములో ఇన్చార్జ్ ఎంపీడీవో మమతా దేవి, ఏపీవో అనిల్ కుమార్ రెడ్డి, సర్పంచ్ అంగజాల నాగవేణి, కన్వీనర్ రామయ్య ,వైఎస్ఆర్సిపి నాయకులు అంగజాల రాజు, కొండ, ఆదినారాయణ రెడ్డి, జయరాం ,గవ్వల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.