nandyala

ప్రపంచ పారా సైకిలింగ్ ఛాంపియన్ అర్షద్ ను సన్మానించిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా

ప్రపంచ పారా సైకిలింగ్ ఛాంపియన్ అర్షద్ ను సన్మానించిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా

నంద్యాల (పల్లెవేలుగు) 10 శనివారం: ప్రపంచ పారా సైకిలింగ్ ఛాంపియన్ అర్షద్ ను ఎమ్మెల్సీ ఇసాక్ బాషా సన్మానించారు. అక్టోబర్ నెలలో పారిస్ లో జరిగిన వరల్డ్ పారా ట్రాక్ సైకిలింగ్ చాంపియన్ షిప్ 2022లో 19 వ ర్యాంకర్ గా నిలిచి గత నెల నవంబర్లో మలేషియాలో జరిగిన మలేషియన్ పారా ట్రాక్  సైకిలింగ్ చాంపియన్ షిప్ 2022లో ఒక కిలోమీటర్ విభాగంలో గొల్డ్ మెడల్ 3 కిలోమీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్, 15 కిలోమీటర్ల విభాగంలో 2 సిల్వర్ మెడళ్ళను సాధించిన నంద్యాల నడిగడ్డకు చెందిన తెలుగు తేజం అర్షధ్ ను ఎమ్మెల్సీ ఇసాక్ బాషా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ చిన్న వయసులోనే అర్థద్ ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లో మన దేశానికి గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిపెట్టిన అర్షద్ మన నంద్యాలకు చెందిన వ్యక్తి కావడం మాకు గర్వకారణమన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో పతకాలను సాధించి మన దేశానికి, రాష్ట్రానికి, నంద్యాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. అనంతరం శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. చాంపియన్ అర్షద్ మాట్లాడుతూ తాను ఇన్ని పతకాలు సాధించడానికి ఎంతో ఖర్చుతో కూడిన శిక్షణ కోసం సహాయ, సహకారాలు అందించిన హైదరాబాద్ కు చెందిన ఆదిత్య మెహతా ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రతిభా పాటవాలు మన గౌరవ ముఖ్యమంత్రి దాకా చేరవేసి తనకు ఉద్యోగ అవకాశం కల్పించడానికి కృషి చేస్తున్న ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button