
ప్రథమ స్థానం కైవసం చేసుకున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జట్టు
ప్రథమ స్థానం కైవసం చేసుకున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జట్టు
శ్రీ మారెమ్మ దేవర ఉత్సవాల సందర్భంగా దుద్ది గ్రామంలో నిర్వహించిన డివిజన్ స్థాయి కబడ్డీ పోటీల్లో చిన్న బొంపల్లి గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జట్టు ప్రథమ స్థానం కైవసం చేసుకుంది…గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జుట్టు మరియు పల్లెపాడు గ్రామానికి చెందిన జట్ల మధ్య పోటీ హోరాహోరీగా జరిగింది. ప్రథమ స్థానం లక్ష్మీ నరసింహ స్వామి జట్టు కైవసం చేసుకోగా ద్వితీయ స్థానంలో పల్లెపాడు చెట్టు నిలిచింది. అలాగే తృతీయ స్థానం దుద్ది మారెమ్మ దేవి జట్టు,నాలుగవ స్థానంలో చెన్నకేశవ జట్టు నిలిచింది. ఈ క్రీడలు వ్యాయామ ఉపాధ్యాయులు కేశవ, బసవరాజు, ఆనంద్, నాగరాజు, విజయ్ ఆధ్వర్యంలో జరిగాయి.. శుక్రవారం గెలుపొందిన జట్లకు ప్రథమ బహుమతి 5116/- ఏపీయూడబ్ల్యూజే మండల ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్, ద్వితీయ బహుమతి 3116/- తుసేని చిన్న లక్ష్మన్న, తృతీయ బహుమతి 2116/- గ్రామ సర్పంచ్ వరలక్ష్మి, నాలుగో బహుమతి 1116/- ఈశ్వరయ్య లు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే మండల ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో క్రీడలు నిర్వహించడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు.. గ్రామంలో నిర్వహించే క్రీడలకు ప్రతి ఒక్కరు సహకరించి క్రీడాకారులను ప్రోత్సహించాలన్నారు. .ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు ఎండపల్లి మూకయ్య, మల్లేష్, నీలప్ప రమేష్, ఈశ్వరయ్య, మహమ్మద్ వీరేష్, గోవిందు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..