nandyala

ప్రతి ఇంటిలో భారత రాజ్యాంగ గ్రంధం ఉండాలి

ప్రతి ఇంటిలో భారత రాజ్యాంగ గ్రంధం ఉండాలి

నంద్యాల ప్రజాస్వామ్య పరి రక్షణ ఐక్య వేదిక నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యములో  నేడు స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి తో భారత రాజ్యాంగ పీఠిక  బ్యానర్ ను ఆవిష్కరించారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి  మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి 1949 నవంబర్ 26 వ తేదీన రావడం జరిగింది. కావున ప్రతి సంవత్సరం నవంబర్ 26 న రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం గా జరుపుకుంటాము . రాజ్యాంగానికి ఆత్మ వంటిది రాజ్యాంగ పీఠిక. రాజ్యాంగం యొక్క మొత్తం సారాంశం ఈ పీఠికలో చెప్పబడినది కావున ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని తెలిపారు. ప్రజాస్వామ్య పరి రక్షణ ఐక్య వేదిక నంద్యాల జిల్లా అధ్యక్షులు ఆకుమాళ్ళా రహీమ్ మాట్లాడుతూ  భారత రాజ్యాంగం ప్రతి ఇంటిలో ఉండాలని . మొత్తమ్ భారతీయుల  ఆధునిక ధర్మ శాస్త్రం భారత రాజ్యాంగం గ్రంధం అని తెలిపారు.స్థానిక ప్రభుత్వాలు ,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా రాజ్యాంగం ఆధారంగానే పాలన సాగిస్తున్నాయి. అందువలననే మా ప్రజాస్వామ్య పరి రక్షణ ఐక్య వేదిక భారత రాజ్యాంగం పైన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని .అందులో భాగంగానే ఈ రాజ్యాంగ పీఠిక బ్యానర్ ను నంద్యాల లోని ప్రతి ప్రభుత్వ కార్యాలయాల వద్ద  అంటించడం జరుగుతుంది అని తెలిపారు.నవంబర్ 26 వ తేదీ ప్రతి పాటశాల మరియు కళాశాల లో రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం ను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆకుమల రహీమ్, జిల్లా కోశాధికారి సత్యనారాయణ గుప్తా,మండల అధ్యక్షులు ఉమా మహేష్, మండల ప్రధాన కార్యదర్శి శివ నారాయణ, పట్టణ కోశాధికారి సయ్యద్ మౌలాలి తదితరులు పాల్గొన్నారు

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button