
ప్రతి ఆటలో గెలుపు ఓటమిలు సర్వసాధారణం..మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డి
ప్రతి ఆటలో గెలుపు ఓటమిలు సర్వసాధారణం.. మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డి
ప్రతి ఆటలో గెలుపు ఓటమిలు సర్వసాధారణమని మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డి అన్నారు. అదివారం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రము కోసిగిలో శ్రీ రేణుకా యల్లమ్మ దేవాలయం గ్రౌండ్ నందు క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, యువనేతలు ధరణీ రెడ్డి, ప్రదీప్ రెడ్డి సహాకారంతో నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమాల బహుమతి ప్రాధానోత్సవ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మండల ఇంచార్జీ మురళీ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్బంగా ఫైనల్ మ్యాచ్ గ్లోబల్ ఇండియాతో కేవి లెవెన్ తలబడగా,ఈ మ్యాచును అతిథులు మరియు ప్రేక్షకుల మధ్యన తిలకిస్తూ, చివరగా 5 వికెట్లతో తేడాతో విజయం సాధించిన కేవి లెవెన్ జుట్టుకు మొదటి బహుమతి ప్రదాత ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, యువనేత ధరణీ రెడ్డి, ప్రదీప్ రెడ్డిల క్రింద 20వేలు, రెండో బహుమతి ప్రదాత పోలీసు విజయ్ కుమార్ గ్లోబల్ ఇండియాకు 15 వేల రూపాయలను అతిధుల మధ్యన మురళీ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు నాడిగేని నరసింహులు, యంపీపీ ఈరన్న, మహాంతేష్ స్వామి, మాణిక్యరాజు, ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం బోర్డు సభ్యులు బుళ్ళి నరసింహులు, హోళగుంద కోసిగయ్య, పందికొన మారెప్ప, జంపాపురం బసిరెడ్డి, శివారెడ్డి, కాంట్రాక్ట్ నాగరాజు, పోలీసు విజయ్ కుమార్, అర్గనైజర్లు కృష్ణ, వసంత్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.