kosigi

ప్రతిభ చాటిన పాఠశాల విద్యార్థి

ప్రతిభ చాటిన పాఠశాల విద్యార్థి

 

కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ఏర్పాటుచేసిన మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో దుద్ది గ్రామానికి చెందిన ఖాదర్ అనే విద్యార్థి తన ప్రతిభతో మొదటి బహుమతి సాధించాడు.దుద్ది గ్రామం జడ్పీహెచ్ పాఠశాలలో పదవ తరగతి చదివే ఖాదర్ పక్షులు వన్యప్రాణులనుండి పంట పొలాలను రక్షించుకోవడానికి కొత్త పరికరాన్ని ఆవిష్కరించాడు. ఈ పరికరం ద్వారా కేవలం అగ్గిపుల్లల మందుతో టపాసులు నుంచి వచ్చే శబ్దం పుట్టించడంతో  ఎటువంటి ఖర్చు లేకుండా పిచ్చుకలను వన్నె ప్రాణులను తరిమికొట్టి పంటలు రక్షించుకోవచ్చని వివరించాడు. పనికిరాని వ్యర్థ పదార్థాలయిన ఇనుప కడ్డీ నట్టు బోల్టు, సైకిల్ ట్యూబ్ వాచర్ తో తయారుచేసిన పరికరం రైతులకు ఉపయోగకరంగా ఉందని పలువురి ప్రశంసలు పొందుతున్నాడు. దుద్ది గ్రామ జడ్పీహెచ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణ మాట్లాడుతూ మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో పాఠశాలకు మొదటి బహుమతి రావడం చాలా ఆనందకరంగా ఉందని ఇదే ప్రయోగాన్ని జిల్లా స్థాయిలో కూడా ప్రదర్శించి విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తెచ్చే కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

Mohammad Yousuf

Mohammad Yousuf Reporter, Kosigi, Kurnool DIst
Back to top button