
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు గడగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు గడగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
– వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు వై.బాలనాగిరెడ్డి.
పెద్దకడబూరు (పల్లెవెలుగు) 05 ఆగష్టు: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకునేందుకే గడగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు వై. బాలనాగిరెడ్డి అన్నారు. గురువారం కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం మేకడోన గ్రామ సచివాలయం పరిధిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన నాయకులు వై. ప్రదీప్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, మండల అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గడగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వై.బాలనాగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రామ సచివాలయ సిబ్బంది,వలంటీర్లతో కలిసి గడగడపకు వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలను లబ్దిదారులకు చదివి వినిపించడమే కాకుండా, వారి ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వెంటనే అధికారులను ఆదేశించారు. మరో వైపు గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో పిల్లలను పలకరిస్తూ, గర్భిణీలను బాలింతలను మోను ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నారా లేదా అడిగి తెలుసు కున్నారు.అలాగే గ్రామ త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ 50 లక్షలతో ట్యాంక్ నిర్మిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యంపీడీఓ నాగేశ్వరరావు, తాహశీల్దార్ వీరేంద్ర గౌడ్, ఈఓపీఆర్డీ రమణయ్య, సర్పంచ్ కృష్ణ,మండల ఉపాధ్యక్షులు పరమేష్ గౌడ్, నారాయణ స్వామి, విజేంద్ర రెడ్డి, మాజీ యంపీపీ రఘురాం, జాంమూకయ్య, మాజీ సర్పంచ్ షేర్ ఖాన్, నాగేంద్ర ఆయా శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది మరియు వాలింటర్లు పాల్గొన్నారు