nandyala

ప్రజాస్వామ్య లౌకిక ఐక్యవేదిక, నంద్యాల, ఆధ్వర్యంలో ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తూ నిరసన దీక్ష

ప్రజాస్వామ్య లౌకిక ఐక్యవేదిక, నంద్యాల, ఆధ్వర్యంలో ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తూ నిరసన దీక్ష

నంద్యాల (పల్లెవేలుగు) 28 డిసెంబర్: స్థానిక తాలూకా ఆఫీసు ఎదురుగా నిర్వహించిన  ఈ దీక్షను జమాతీస్లామీ హింద్ సీనియర్ నాయకులు జనాబ్ మోమిన్ గౌస్ మోదిన్ ప్రారంభించారు. పిడిఎస్యూ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ రఫీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రజాస్వామ్య లౌకిక ఐక్యవేదిక కన్వీనర్ మొహమ్మద్ అబులైస్, కో కన్వీనర్ మస్తాన్ ఖాన్, ఆవాజ్ జిల్లా కన్వీనర్ మస్తాన్వలి, జమాతీస్లామి నంద్యాల అధ్యక్షులు అబ్దుల్ సమద్,  హుస్సేని, భాస్కర్ దీక్షలో  పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్సీ ఎన్ ఎమ్ డి ఫారూఖ్, కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి చింతలం మోహన్ రావు, సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, సిపిఐ  జిల్లా  సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, ఐ యూ ఎమ్మెల్ మౌలానా అబ్దుస్ సలాం,ఆవాజ్ పట్టణ అధ్యక్షులు బాబూల్లా, ఇమాముల సంఘం నాయకులు మౌలానా అబ్దుల్లా,అబ్దుల్ హాది, టిడిపి నాయకులు  జిల్లెల్ల శ్రీరాములు,  అసదుల్లా,మునీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ ఎన్ ఎం డి ఫరూక్ మాట్లాడుతూ అధిష్టానంతో మాట్లాడి లోక్సభలో ఉమ్మడి పౌర స్మృతి బిల్ కు వ్యతిరేకంగా ఓటు ఇవ్వమని కోరతామని. మోడీ, ఈడీ కి భయపడి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి తప్ప వాస్తవానికి ఈ బిల్లుకు అందరూ వ్యతిరేకించారని అన్నారు. వక్తలు మాట్లాడుతూ ఏదేమైనా దేశం లోని SC, ST, BC, మైనారిటీ లందరూ కలసి ప్రజాస్వామ్య లౌకిక  వాదులుగా తమ ఐక్యత చాటుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  ఇప్పటికే  రాజ్యసభలో ఈ బిల్లునుకాంగ్రెస్, CPM, CPI, IUML,TRS,TMC లాంటి పార్టీలు వ్యతిరేకించాయని, అలాగే లోక్సభలో బిల్లుకు వ్యతిరేకంగా YSRCP, టీడీపీ లు తమ వంతు బాధ్యతగా పోరాడాలని అన్నారు. నిరుద్యోగత, ఆర్థికమాంద్యం, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, మత ద్వేషం, భాషాద్వేషాల సమస్యలను ప్రక్కద్రోవ పట్టించడానికి ఓటుబ్యాంక్ కోసం బీజేపీ ఈ బిల్లును ముందుకు తెచ్చిందని,

      విభిన్న మతాలు,కులాలు, జాతులు గల భారతదేశానికి ఉమ్మడి పౌరస్మృతి తేవడం సరైన విధానం కాదని. విభిన్న మతాలలో పెళ్లి, ఆస్తిపంపకాలు, గురించి విభిన్న సాంప్రదాయాలు ఉన్నాయని, ఎవరి పెర్సొనల్ లా ను వారు శాంతియుతంగా రాజ్యాంగం కల్పించిన హక్కులతో అమలు చేసికొంటున్నారని, ఈ బిల్లు తేవడం ద్వారా ముస్లింల, క్రిస్టియన్ల, గిరిజనుల, ఆదిమవాసుల రాజ్యాంగ ప్రాథమిక హక్కులను కాలరాయడమే అవుతుందని అభిప్రాయపడుతూ, రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈ బిల్లుకు ఆమోదం తెలపకూడదని కోరారు. నంద్యాల ప్రభుత్వ ఖాజి జనాబ్ ముహమ్మద్ సందాని గారు దీక్షలో పాల్గొన్నవారికి నిమ్మరసం ఇవ్వడం ద్వారా దీక్షను విరమింపచేశారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button