nandyala

ప్రజాస్వామ్య పరి రక్షణ ఐక్య వేదిక ఆద్వర్యం లో రెండు రోజుల శిక్షణ తరగతులు

ప్రజాస్వామ్య పరి రక్షణ ఐక్య వేదిక ఆద్వర్యం లో రెండు రోజుల శిక్షణ తరగతులు

నంద్యాల (పల్లెవేలుగు) 25 నవంబర్: ప్రజాస్వామ్య పరి రక్షణ ఐక్య వేదిక నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని జిల్లా కార్యాలయంలో ఐక్య వేదిక మండలాల భాద్యులకు రెండురోజుల శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతావుంది. ఈ శిక్షణా తరగతులకు ముఖ్య అతిథులుగా ప్రజాస్వామ్య పరి రక్షణ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రామ కృష్ణ రెడ్డి మరియు కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ నేడు హాజరయ్యారు. ఆరు మండలాల నుండి 20 మంది సభ్యులు హాజరు కావడం జరిగింది. మొదటి రోజు ఐక్య వేదిక పరిచయం అనే అంశమును నంద్యాల జిల్లా అధ్యక్షులు ఆకుమల్ల రహీమ్, సమాచార హక్కు చట్టం అనే అంశము ను కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ మరియు ప్రేరణ అనే అంశమును రాష్ట్ర అద్యక్షులు రామ కృష్ణ రెడ్డి శిక్ష కులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డీపీ మస్తాన్ వలీ, జిల్లా కోశాధికారి సత్యనారాయణ గుప్తా, జిల్లా ఉపాధ్యక్షులు బండి ఆత్మకూరు గంగాధర రెడ్డి, నంద్యాల పట్టణ ఉపాధ్యక్షులు నబీ రసూల్, బండి ఆత్మకూరు మండలం అధ్యక్షులు సంపంగి రామ రాజు, ఉపాధ్యక్షులు రామ చంద్రుడు తదితరులు పాల్గొన్నారు

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button