
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఆర్డిఓ తిప్పే నాయక్
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఆర్డిఓ తిప్పే నాయక్
ధర్మవరం (పల్లె వెలుగు) గత మూడు రోజులుగా రెవెన్యూ డివిజన్ పరిధిలో ని ప్రాంతాలలో అధిక వర్షపాతం నమోదు కావడం జరుగుతోందని, ఈ దశలో ప్రజలు,విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు యాజమాన్యం, అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డీవో తిప్పే నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం వారు మాట్లాడుతూ వాగులు, వంకలు, వర్షానికి ఎక్కువ అయ్యాయని, దాటేటప్పుడు తగిన నిర్ణయం తీసుకొని దాటాలని, ఉదృతం ఉంటే పోకూడదని తెలిపారు. విద్యార్థులు స్కూలు, కళాశాలకు వెళ్లేటప్పుడు రోడ్డు దాటే సమయంలో గానీ, రోడ్డులో నీరు నిల్వ ఉన్నప్పుడు గుంతలు ఉంటాయని గమనిస్తూ వెళ్లాలని తెలిపారు. విద్యార్థులను తీసుకొని వెళ్ళు ప్రైవేటు బస్సులు కానీ ఆటోల గాని డ్రైవర్లు నెమ్మదిగా వెళ్లాలని తెలిపారు. అదేవిధంగా పాత ఇళ్లల్లో నివాసముండు వారు, రాత్రిపూట వేరేచోట నిద్రించాలని తెలిపారు. ఎందుకంటే ఎడతెరిపి లేకుండా వర్షాలు వస్తున్నాయని, పాత గోడలు తడిచే అవకాశంతో పాటు కుప్పకూలే ప్రమాదం ఉందని వారు గుర్తు చేశారు. అదేవిధంగా డివిజన్ పరిధిలో వర్షానికి నష్టమైనటువంటి విషయాలు ఏమైనా ఉంటే, ఆయా డివిజన్ పరిధిలోని తహసిల్దార్ కార్యాలయమునకు తెలియజేయాలని తెలిపారు. చిన్నపాటి నిర్లక్ష్యం వలన ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని ప్రజలు గుర్తు ఎరగాలని తెలిపారు. ఈ సమయంలో వివిధ ప్రభుత్వ కార్యాలయ అధికారులకు ఏదైనా ఫిర్యాదులు అందితే,వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.