
పౌర్ణమి తిది శ్రావణ నక్షత్రం నందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి సామూహిక కళ్యాణం..
పౌర్ణమి తిది శ్రావణ నక్షత్రం నందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి సామూహిక కళ్యాణం..
నంద్యాల ఆగష్టు 12 స్థానిక నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ రామాలయంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కి లోక కళ్యాణం కొరకు శుక్రవారం శ్రావణమాసం పౌర్ణమి శ్రావణ నక్షత్రమునందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సామూహిక కళ్యాణోత్సవం జరిగినది ఈ కళ్యాణోత్సవానికి అనేకమంది భక్తులు పాల్గొనడం జరిగింది. శుక్రవారం రోజు కావున మూలవిరాట్ వారికి పంచామృతాభిషేకం మరియు స్వామివారికి అలంకరణ జరిగినది. కల్యాణోత్సవంఅనంతరం భక్తులందరికీ శ్రీ భగవత్ సేవా సమాజ వారు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ శ్రీ కోదండ రామాలయం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అధ్యక్షులు శ్రీ సముద్రాల సూరయ్య ప్రధాన కార్యదర్శి శ్రీ వంకదార మధుసూదన్ రావు, కోశాధికారి శ్రీ మాఘం గురు ప్రసాద్ తదితర భక్త బృందం పాల్గొనడం జరిగింది.