Dharmavaram

పోతుల నాగేపల్లి లేఅవుట్లో అణాధికారకంగా వాటర్ వాడుతున్న వారిపై చర్యలు  మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున

పోతుల నాగేపల్లి లేఅవుట్లో అణాధికారకంగా వాటర్ వాడుతున్న వారిపై చర్యలు  మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున

 ధర్మవరం( పల్లె వెలుగు )పోతుల నాగేపల్లి లేఅవుట్ నందు గత కొద్దిరోజులుగా మున్సిపాలిటీ వారు ఏర్పాటుచేసిన 11 మోటార్ల లలో కొన్ని మోటార్లకు కరెంటు వచ్చే తీగలను తొలగిస్తూన్న ట్రాక్టర్ వాటర్ సప్లై చేసే యజమానులకు మున్సిపల్ కమిషనర్ గట్టి హెచ్చరికలు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని పోతుల నాగేపల్లి లో మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసిన కొన్ని వాటర్ మోటార్ పంపులకు గల విద్యుత్ వైర్లను కొన్ని రోజులుగా, ట్రాక్టర్ యజమానులు ఆ వైర్లను కత్తిరించి, ఒక డ్రమ్ముకు 50 రూపాయలు చొప్పున నీటిని విక్రయిస్తున్నారు. దీంతో మున్సిపాలిటీ ద్వారా నీటి పంపిణీ గత కొన్ని రోజులుగా నిలిచిపోవడంతో ప్రజల వద్ద ఫిర్యాదులు అందడం, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం వారు ఇక్కడికి చేరుకున్నారు. కమిషనర్ తో పాటు రూరల్ సీఐ మన్సూర్ ఉద్దీన్, హౌసింగ్ డిఇ. మునీశ్వర నాయుడు, హౌసింగ్ ఏఈ బాలాజీ, మున్సిపల్ ఇంజనీరింగ్ ఏఈ హరీష్లు, చేరుకొని అక్కడి మోటార్లను పరిశీలించారు. తదుపరి సిఐ సమక్షంలో నీటిని పంపిణీ చేసే ట్రాక్టర్ డ్రైవర్లను యజమానులను పిలిపించి, విచారణ నిర్వహించారు. ఈ విచారణలో కొంతమంది విద్యుత్ వైర్లను కట్ చేసి, తమ వ్యాపారాలను యదేక్షగా చేసుకునేందుకు ఇటువంటి పనిని చేయడం జరిగిందన్న వాస్తవం బయటపడింది. దీంతో కమిషనర్ సిఐ సమక్షంలో ట్రాక్టర్ యజమానులకు డ్రైవర్లకు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా రాత్రి సమయాలలో ఇసుక, రాళ్లను కూడా చోరీ కు గురవుతున్నాయని విషయాన్ని వారు  పరిశీలించారు.మరోసారి ఇటువంటి సంఘటన జరిగితే కఠిన చర్యలతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని వారికి తెలిపారు. అధికారులు స్పందించడం పట్ల ప్రజలు కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

chiranjeevi

Chiranjeevi Reporter,Dharmavaram, Satyasai District
Back to top button