Dharmavaram

పేద ప్రజలకు సేవ చేయుటలోనే తృప్తి ఉంది.. రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు

పేద ప్రజలకు సేవ చేయుటలోనే తృప్తి ఉంది.. రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు

ధర్మవరం (పల్లె వెలుగు) అక్టోబర్ 9:  పేద ప్రజలకు సేవ చేయుటలోనే తృప్తి ఉందని రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణమూర్తి,రామకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం పట్టణంలోని కోట మున్సిపల్ స్కూల్ లో రోటరీ క్లబ్బు ఆధ్వర్యంలో, ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరం రోటరీ క్లబ్బు, ఇన్నర్ వీల్ క్లబ్ ,శంకర కంటి ఆసుపత్రి.. బెంగళూరు అండ్ జిల్లా అందత్వ నివారణ సంస్థ అనంతపురం జిల్లా వారి సహకారంతో నిర్వహించారు. బెంగళూరు శంకర కంటి ఆసుపత్రి కంటి డాక్టర్ మయూరి చౌదరి కంటి సమస్యలున్న రోగులందరికీ వైద్య చికిత్సలను అందించి, తగిన జాగ్రత్తలను తెలియజేశారు. అనంతరం రోటరీ క్లబ్ అధ్యక్షులు కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరానికి దాతగా కీర్తిశేషులు బండారు నారాయణమ్మ బండారు శివయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు బండారు శ్రీనివాసులు బండారు రత్నమ్మలు నిర్వహించడం పట్ల కృతజ్ఞతలను తెలియజేశారు. మానవ సేవే మా పరమావధిగా తాము పనిచేస్తున్నామని తెలిపారు. ఈ శిబిరంలో 338 మంది రోగులు హాజరుకాగా, కంటి ఆపరేషన్లకు 228మంది ఎంపికైనట్లు వారు తెలిపారు. ఈ శిబిర విజయానికి సహకార అందించిన సీనియర్, జూనియర్ ,మాజీ క్లబ్ సభ్యులు,  రవాణా సౌకర్యం కల్పించిన కీర్తిశేషులు ఉలిక్కిరెడ్డి కుమారుడు కె రామచంద్రారెడ్డి అండ్ మిత్రులకు తదితరులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఇటువంటి శిబిరాలు ప్రతి నెల రెండవ ఆదివారం నిర్వహించడం జరుగుతుందన్నారు. తొలుత శంకర కంటి ఆసుపత్రి కంటి డాక్టర్ మయూరి చౌదరి, దాత బండారు కుటుంబ సభ్యులు  జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. బిపి అండ్ షుగర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. అనంతరం శంకర కంటి ఆసుపత్రి కంటి డాక్టర్ను మయూరి చౌదరి, ఆసుపత్రి సూపర్వైజర్ శివ ప్రకాష్ లను రోటరీ క్లబ్ వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్యాంపు చైర్మన్ నరేందర్ రెడ్డి, ఆర్గనైజర్ సత్రశాల ప్రసన్న కుమార్, రోటరీ క్లబ్ డిస్టిక్ ఆఫీసర్ రత్నశేఖర్ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి,  సుదర్శన్ గుప్తా, జయసింహ, శివయ్య, బండారు చలం, చందా జయచంద్ర, పెద్దారెడ్డి ఎల్ఐసి ఏజెంట్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

chiranjeevi

Chiranjeevi Reporter,Dharmavaram, Satyasai District
Back to top button